విజయవాడలో రేపటి నుంచి 144 సెక్షన్ అమలు

విజయవాడలో రేపటి నుంచి 144 సెక్షన్ అమలు కానుందని పోలీసులు తెలిపారు.

ఈ మేరకు ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో ఈ సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడించారు.

రేపటి నుంచి యాభై రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కాంతి రాణా పేర్కొన్నారు.ఈ క్రమంలో నలుగురు లేదా అంతకు మించి కానీ ప్రజలు గుమిగూడరాదని తెలిపారు.

నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.అయితే గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో ఆందోళనలు, అల్లర్లు చోటు చేసుకుంటున్నాయన్న ప్రజలు తమ దృష్టికి తీసుకురావడంతో ఈ చర్య తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ కాంతి రాణా స్పష్టం చేశారు.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు