అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టో అమలు..: మల్లికార్జున ఖర్గే

తెలంగాణలో అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తామని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తెలిపారు.

మ్యానిఫెస్టోను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ఓటర్లు నిర్ణయించుకున్నారని మల్లికార్జున ఖర్గే తెలిపారు.బీజేపీ నేతలు బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం లేదన్న ఆయన కేసీఆర్, మోదీ కూడా పరస్పర విమర్శలు మానేశారని పేర్కొన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు.ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement