క‌రోనా విజృంభిస్తున్న వేళ రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే సూప‌ర్ ఫుడ్ ఇదే..!!

కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మ‌జీవి క‌రోనా.గ‌త ఏడాది చైనాలో పుట్టి అన‌తి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే క‌రోనా మ‌హ‌మ్మారి ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను హ‌రించివేస్తుంది.వ్యాక్సిన్ అందుబాటులో లేక‌పోవ‌డంతో.

అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తున్న క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం ప్ర‌పంచ‌దేశాలకు పెద్ద స‌వాల్‌గా మారింది.అయితే ఈ ప్రాణాంత‌క వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ పొందాల‌న్నా.

ఈ మ‌హ‌మ్మారితో పోరాడాల‌న్నా.శ‌రీరంలో రోగనిరోధక శక్తి(ఇమ్యూనిటీ పవర్‌) బ‌లంగా ఉండాల‌ని నిపుణులు అంటున్నారు.

Immunity Power Boost Food Protect The Human Body, Immunity Power, Ginger, Tumari
Advertisement
Immunity Power Boost Food Protect The Human Body, Immunity Power, Ginger, Tumari

దీంతో అంద‌రూ ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఫుడ్ మీ డైలీ డైట్‌లో చేర్చుకుంటే మీ రోగ‌నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డ‌మేగాక‌.క‌రోనాతో కూడా పోరాడ‌గ‌ల‌రు.ఇందులో ముందుగా.

అల్లం. ఇది ప్ర‌తిఒక్క‌రి ఇంట్లోనూ ఉంటుంది.

కొన్ని శతాబ్దాల నుంచి చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది.అందుకే అల్లం ప్ర‌తిరోజు ఏదో ఒక‌రూపంలో తీసుకుంటే.

జీర్ణవ్యవస్థను మెరుగుప‌డ‌డంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Immunity Power Boost Food Protect The Human Body, Immunity Power, Ginger, Tumari
నారా లోకేష్ పై విరుచుకుపడ్డ మంత్రి దాడిశెట్టి రాజా..

అలాగే విటమిన్‌ సి ఉన్న బత్తాయి, కమలాపండు, జామకాయ, నిమ్మకాయ, కాప్సికమ్‌లాంటివి ప్ర‌తి రోజు తీసుకోవ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవ‌చ్చు.ఇక వంటల్లో ముఖ్య‌మైనది ప‌సుపు.అంటువ్యాధులతో పోరాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.మ‌రియు శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని కూడా పెంపొందిస్తుంది.

Advertisement

అదేవిధంగా, వెల్లుల్లి, మిరియాలు, ఆకుకూరలు, పాలు, పెరుగు, న‌ట్స్‌, ఎండు ఖర్జూరాలు వంటివి డైలీ డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల‌ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

తాజా వార్తలు