ఇలియానాకు మరోసారి టాలీవుడ్‌ నుండి పిలుపు అందిందా?

తెలుగు ప్రేక్షకులకు ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

టాలీవుడ్‌ హీరోయిన్స్ లో మొదటి కోటి రూపాయల పారితోషికం దక్కించుకున్న హీరోయిన్‌ గా ఎప్పటికి ఇలియానా నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు.

హీరోయిన్ గా ఇలియానా యొక్క జోరు ఒకానొక సమయంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ ను కూడా ఆశ్చర్యరపర్చింది.కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి కాస్త ఇబ్బందిగా కష్టంగా ఉంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె రీ ఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది.బాలీవుడ్‌ లో ఆఫర్లు తగ్గిన సమయంలో కూడా టాలీవుడ్‌ లో రీ ఎంట్రీకి ఆమె ఆసక్తి చూపించలేదు.

అక్కడ పరిస్థితి పూర్తిగా అడ్డం తిరిగితేనే టాలీవుడ్‌ లో ఆఫర్ల కోసం ఈ అమ్మడు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Advertisement

ఇలియానా ఇటీవల ఒక తెలుగు సినిమా కు కమిట్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.కానీ ఒక సీనియర్ హీరో సినిమాలో హీరోయిన్ పాత్రకు ఆమెను ఎంపిక చేయడం జరిగిందని.

చాలా రోజుల తర్వాత ఇలియానా ఒక తెలుగు సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఆ మధ్య రవితేజ కు జోడీగా ఈమె నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చింది.

అందుకే ఈ సినిమా అయినా ఆమెను మళ్లీ తెలుగు లో బిజీ చేసేనా అనేది చూడాలి.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఇలియానా యొక్క తెలుగు సినిమా విశేషాలు అతి త్వరలోనే వెళ్లడి అయ్యే అవకాశం ఉంది.ఇలియానా యొక్క బాలీవుడ్‌ కెరీర్‌ ఏమాత్రం ఆశాజనకంగా లేదు.అందుకే ఇటు వైపు ఈ గోవా బ్యూటీ చూస్తోంది.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

ముందు ముందు ఏం జరుగుతుంది అనేది చూడాలి.ఇలియానా కనుక మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయితే కచ్చితంగా అధ్బుతం అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు