రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు..: మంత్రి అంబటి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ లో అసహనం కనిపిస్తుందని తెలిపారు.

రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోచుకుందని మంత్రి అంబటి ఆరోపించారు.

పట్టిసీమ ప్రాజెక్టులో మొత్తం దోపిడేనని పేర్కొన్నారు.ఈ క్రమంలో గత టీడీపీ ప్రభుత్వం చేసిన దోపిడీని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.

ఎవరెన్నీ కుట్రలు, కుతంత్రాలు చేసినా వైసీపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు