ఈ సింపుల్ టిప్ ను పాటిస్తే 60 లోనూ యంగ్ గా మెరిసిపోవడం ఖాయం!

వయసు పెరిగే కొద్దీ ముడతలు, చర్మం సాగటం, చర్మంపై గీతలు తదితర వృద్ధాప్య లక్షణాలన్నీ తలుపు తడుతుంటాయి.

వీటి వల్ల ముఖంలో కాంతి తగ్గడమే కాదు ఆత్మ విశ్వాసాన్ని కూడా కోల్పోతుంటారు.

ఈ జాబితాలో మీరు ఉండకూడదు అంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్ ను పాటిస్తే సరి.ఈ టిప్ ను పాటిస్తే కనుక అర‌వైలోనూ యంగ్ గా మెరిసిపోవడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో రెండు నుంచి మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి ఒక చిన్న కప్పు వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న‌ ఖర్జూరాలను వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పాల మీగ‌డ‌ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైన‌ర్ సహాయంతో స్మూత్ పేస్ట్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఈ పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్, హాఫ్‌ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.చర్మం కంప్లీట్ గా డ్రై అయిన అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్‌ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే ముఖం ఎల్లప్పుడూ య‌వ్వ‌నంగా మరియు ఆరోగ్యంగా మెరిసిపోతోంది.

చర్మం మృదువుగా కోమలంగా త‌యార‌వుతుంది.వయసు పెరిగిన వృద్ధాప్య లక్షణాలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే ఈ చిట్కాను పాటించడం వల్ల చర్మం తెల్లగా కాంతివంతంగా సైతం మారుతుంది.

కాబట్టి తప్పకుండా ఈ టిప్ ను పాటించేందుకు ప్రయత్నించండి.అందంగా యవ్వనంగా మెరిసిపోండి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు