ట‌మాటోతో ఇలా చేస్తే తెల్ల జుట్టుకు దూరంగా ఉండొచ్చు.. తెలుసా?

తెల్ల జుట్టు.అత్య‌ధికంగా వేధించే కేశ సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.న‌ల్ల‌గా నిగ‌నిగ‌లాడాల్సిన జుట్టు తెల్ల‌గా మారుతుంటే.

ఎక్క‌డ్లేని ఒత్తిడి, ఆందోళ‌న మ‌న చుట్టూనే తిరుగుతుంటాయి.ఇరుగు పొరుగు వారు ఎగ‌తాళి చేస్తారేమో అని తెల్ల జుట్టుతో బ‌య‌ట‌కు వెళ్ల‌డానికే సంకోచిస్తుంటారు.

ఈ క్ర‌మంలోనే తెల్ల జుట్టును క‌వ‌ర్ చేసుకునేందుకు నానా పాట్లు ప‌డుతుంటారు.అయితే తెల్ల జుట్టు వ‌చ్చాక ముప్ప తిప్ప‌లు ప‌డ‌టం కంటే.రాకుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఎంతో ఉత్త‌మం అని అంటున్నారు నిపుణులు.

అయితే అందుకు ట‌మాటో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ముఖ్యంగా ట‌మాటోతో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా చేస్తే వ‌యసు పైబ‌డినా తెల్ల జుట్టుకు దూరంగా ఉండొచ్చు.

Advertisement

మ‌రి ఇంకెందుకు లేటు వైట్ హెయిర్ ద‌రి చేర‌కూడ‌దంటే టమాటోతో ఏం చేయాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా రెండు ట‌మాటోల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్ లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకుని స్ట్రైన‌ర్ సాయంతో జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఈ ట‌మాటో జ్యూస్ లో మూడు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడ‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి.ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.

గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేయాలి.వారంలో ఒక్క‌సారి ట‌మాటోతో ఈ విధంగా హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు త్వ‌ర‌గా తెల్ల బ‌డ‌కుండా ఉంటుంది.అలాగే ఈ రెమెడీ ద్వారా హెయిర్ ఫాల్‌, ఆయిలీ హెయిర్ వంటి స‌మ‌స్య‌ల నుంచి సైతం ఉప‌శ‌మ‌నాన్ని పొందొచ్చు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు