మంగళవారం ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయను ఇలా చేస్తే..?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా పండుగలు వచ్చినా లేదా శుభకార్యాలు జరిగినా ముందుగా కొబ్బరి కాయలు కొట్టి శుభ కార్యాలు ప్రారంభిస్తారు.

కొబ్బరికాయకు మన హిందువులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.

కొబ్బరికాయను శ్రీ ఫలం అని కూడా పిలుస్తారు.శ్రీ అంటే లక్ష్మీ దేవి.

లక్ష్మీ దేవికి కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతి.అందుకే మన జీవితంలో ఏర్పడిన కష్టాలు తొలగిపోవాలంటే కొబ్బరికాయతో ఈ విధంగా చేయాలని పండితులు చెబుతున్నారు.

మంగళవారం ఉదయం తలంటు స్నానం చేసి దేవుని గదిలో పూజలు నిర్వహించాలి.పూజ అనంతరం ఒక కొబ్బరికాయను తీసుకుని కొబ్బరికాయను ఎర్రని వస్త్రంలో చుట్టి ఆంజనేయుని ఫోటో పాదాల చెంత ఉంచాలి.

Advertisement
If You Do This With A Coconut On A Red Cloth Onc Oconut, Pooja, Tuesday, Red Clo

మంగళవారం కొబ్బరికాయతో ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.అదేవిధంగా శుక్రవారం తలంటు స్నానం చేసి ఎర్రటి దుస్తులను ధరించి కొబ్బరికాయ కొట్టాలి.

అదేవిధంగా ఎర్రటి వస్త్రంలో కట్టిన కొబ్బరికాయ తీసుకొని మన ఇంట్లో ఎవరికీ కనపడకుండా పెట్టడం వల్ల మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ధన లాభం కలుగుతుంది.

If You Do This With A Coconut On A Red Cloth Onc Oconut, Pooja, Tuesday, Red Clo

అదేవిధంగా గురువారం రోజు కొబ్బరికాయను, ఒక తెల్లటి స్వీట్ తీసుకొని పసుపు రంగు వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి పాదాల చెంత పెట్టాలి.ఈ విధంగా కొబ్బరికాయతో చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.ఈ విధంగా చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోతే శనివారం ఆలయానికి వెళ్లి శనీశ్వరుని దగ్గర కొబ్బరికాయలు కొట్టి నదిలో పడేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు