ఆ పని చేస్తే బ్యాక్ పెయిన్ రావడం ఖాయం... నెటిజన్ ప్రశ్నకు సమాధానం చెప్పిన రష్మిక!

కన్నడ చిత్ర పరిశ్రమలో కిరిక్ పార్టీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి రష్మిక( Rashmika ) మందన్న.

ఇలా గట్టిగా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు.

ఇక్కడ కూడా వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నటువంటి రష్మిక అనంతరం తమిళ సినిమా అవకాశాలతో పాటు బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు.భాషతో సంబంధం లేకుండా నార్త్ సౌత్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో ప్రస్తుతం ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు.

If You Do That Work Back Pain Is Sure To Come Rashmika Answered The Question Of

ఇలా సినిమాల పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించి ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను ఈమె ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు.సరదాగా అభిమానులతో చిట్ చాట్( chit chaat ) చేస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఓ అభిమాని తనతో కలిసి సామి సామి అనే పాటకు డాన్స్ చేయాలని ఉంది అంటూ అడిగారు.ఈ ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ ఫన్నీ సమాధానం చెప్పారు.

If You Do That Work Back Pain Is Sure To Come Rashmika Answered The Question Of
Advertisement
If You Do That Work Back Pain Is Sure To Come Rashmika Answered The Question Of

తాను ఇప్పటికే ఎన్నోసార్లు ఈ పాటకు డాన్స్ చేశానని ఇకపై ఇలాగే డాన్స్ చేస్తూ ఉంటే భవిష్యత్తులో తానుకు బ్యాక్ పెయిన్(Back pain) రావడం ఖాయం అంటూ సమాధానం చెప్పారు.రష్మిక అల్లు అర్జున్( Allu Arjun) జంటగా సుకుమార్(Sukumaar) దర్శకత్వంలో నటించిన పుష్ప( Pushpa ) సినిమాలోని ఈ పాట ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే.ఇక ఈ పాటకు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా అద్భుతమైన రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఎక్కడకు వెళ్లిన ఈ పాటకు చిందులు వేస్తూ సందడి చేశారు.ప్రస్తుతం ఈమె పుష్ప సినిమా సీక్వెల్ చిత్రం షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు