సంపత్ నంది ఒక్క హిట్ కొడితే బంపర్ ఆఫర్ కొట్టినట్టే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ చాలామంది హీరోలు ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటే కొంతమంది దర్శకులు( Directors ) మాత్రం వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే వరుస సినిమాలను చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను అయితే చాటుకుంటున్నారు.

If Sampath Nandi Gets One Hit, Its Like A Bumper Offer, Sampath Nandi, Director

ఇక ఇలాంటి క్రమంలోనే సంపత్ నంది( Sampath Nandi ) లాంటి డైరెక్టర్ కూడా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి చూస్తున్నాడు.ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికీ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ( Saidharam Tej )హీరోగా పెట్టి గాంజా శంకర్ ( Ganja Shankar )అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలు అన్ని కూడా ఆవరేజ్ హిట్లుగానే మిగిలాయి.దాంతో గాంజా శంకర్ సినిమా అంతకు మించి మంచి విజయాన్ని అందుకుంటుందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఎందుకంటే ఇప్పటికే ఆయన ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు గడుస్తున్నప్పటికి తన తర్వాత వచ్చిన డైరెక్టర్లు అందరు స్టార్ డైరక్టర్లు గా గుర్తింపు పొందుతున్నప్పటికీ ఈయన మాత్రం ఇంకా మీడియం రేంజ్ డైరెక్టర్ గానే గుర్తింపు సంపాదించుకున్నాడు.

If Sampath Nandi Gets One Hit, Its Like A Bumper Offer, Sampath Nandi, Director
Advertisement
If Sampath Nandi Gets One Hit, It's Like A Bumper Offer, Sampath Nandi, Director

ఇంతవరకు రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసిన కూడా మరొక స్టార్ హీరో తో అయితే సినిమా చేయలేదు.మరి ఈ సినిమా సక్సెస్ అయితే సంపత్ నంది కి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం కూడా ఉన్నట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే ఇంతకు ముందే ఈయనతో ఒక సినిమా చేస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు.

అయినప్పటికీ వీళ్ళ కాంభినేషన్ లో ఇప్పటి వరకు సినిమా రాలేదు.ఇక ఈ సినిమాతో సంపత్ నంది సక్సెస్ కొడితే పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది.

Advertisement

తాజా వార్తలు