పుష్ప 2 సూపర్ సక్సెస్ అయితే ఆ ఇద్దరు డైరెక్టర్ల తర్వాత స్థానం సుకుమార్ గారిదేనా..?

సుకుమార్( Sukumar ) డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప 2( Pushpa 2 ) సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

ఇక దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఇప్పటికే షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఈ సినిమాకు సంభందించిన సీజీ వర్క్ కూడా చాలా తొందరగా కంప్లీట్ చేసి సినిమాని అనుకున్న టైమ్ కి తీసుకురావాలనే ఉద్దేశ్యంలో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలని అల్లు అర్జున్( Allu Arjun ) కూడా చాలా వరకు తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమాతో పాన్ ఇండియాలో 1500 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాలనే లక్ష్యంతో అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి మొత్తానికైతే ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే సుకుమార్ పాన్ ఇండియాలో రాజమౌళి,( Rajamouli ) ప్రశాంత్ నీల్( Prashanth Neel ) తర్వాత అంత మంచి పేరు సంపాదించుకుంటాడు.ఇక ఈ సినిమా 1500 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో మేకర్స్ అయితే ఉన్నారు.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక అల్లు అర్జున్ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు