నిరూపిస్తే నామినేషన్ వెనక్కి తీసుకుంటా..: రేవంత్ రెడ్డి

పాలకుర్తి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని తెలిపారు.

పాలకుర్తి అంటేనే పౌరషాలకు కేరాఫ్ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కు వేల ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

ఎర్రబెల్లి దందాలు చేసి రూ.వేల కోట్లు సంపాదించారన్న రేవంత్ రెడ్డి డీలర్ దయాకర్ రావుు డాలర్ దయాకర్ అయ్యారని ఎద్దేవా చేశారు.దోపిడీ సొమ్ముతో ఓటర్లను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలో ఎర్రబెల్లి మోసాలకు ఈనెల 30న ఓటర్లు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమన్న రేవంత్ రెడ్డి 24 గంటలు కరెంటు ఇచ్చినట్లు నిరూపిస్తే తన నామినేషన్ వెనక్కి తీసుకుంటానని సవాల్ చేశారు.

Advertisement

లేని పక్షంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని ఛాలెంజ్ చేశారు.

అమోఘం.. కొన్న సరుకులకు క్యారీ బ్యాగ్ ఇవ్వలేదని ఏకంగా?(వీడియో)
Advertisement

తాజా వార్తలు