కర్నూలు జిల్లా ఆదోనిలో భారీగా నగదు సీజ్

కర్నూలు జిల్లా ఆదోని( Adoni )లో భారీగా నగదు పట్టుబడింది.ఈ మేరకు రూ.

37 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఎన్నికల కోడ్( Election Code ) అమలులో ఉన్న నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.

ఆదోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మల్లికార్జున అనే వ్యక్తి వద్ద నగదును పట్టుకున్నారు.సరైన పత్రాలు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు అనంతరం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

కాగా ఏపీలో ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న తరుణంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
How Modern Technology Shapes The IGaming Experience

తాజా వార్తలు