ఖుషి కోసం సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్..!

విజయ్ దేవరకొండ ఖుషి సినిమా లవ్ స్టోరీగా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో విజయ్ కు జోడీగా సమంత నటిస్తుంది.

శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మళయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వాహబ్ ని ఫిక్స్ చేశారు.ఇంతకీ ఎవరీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ప్రణవ్ మోహన్ లాల్ నటించిన హృదయం సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అబ్ధుల్ వాహబ్.

లాస్ట్ ఇయర్ వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో హృదయం ఒకటి.ఆ సినిమాలోని సాంగ్స్ ఒక్కొక్కటి ఒక్కో సెన్సేషన్.

ఆ సినిమా సాంగ్స్ తో తెలుగు వారికి దగ్గరయ్యాడు హేషం అబ్ధుల్ వాహబ్.శివ నిర్వాణ ఆల్రెడీ మ్యూజికల్ హిట్స్ అందుకున్న దర్శకుడు.

Advertisement

అలాంటి దర్శకుడి ఖుషి సినిమాకు అబ్ధుల్ పనిచేయడం ఖుషి ఆల్బం మీద అంచనాలు పెంచేస్తున్నాయి.తప్పకుండా ఈ సినిమా మ్యూజిక్ పరంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఈ కాంబినేషన్ చూస్తేనే అర్ధమవుతుంది.

విజయ్, సమంతలతో లవ్ స్టోరీగా శివ నిర్వాణ చేస్తున్న ఖుషి ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు చిత్రయూనిట్.సమంత త్వరలోనే ఖుషి షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు