ఈ నీళ్లు తెల్ల వెంట్రుకలను వేర్ల నుంచి నల్లగా మారుస్తాయా..?

ప్రస్తుత సమాజంలో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు.అందుకు విపరీతంగా డబ్బు ఖర్చు చేసే వారు కూడా ప్రస్తుత సమాజంలో ఉన్నారు.

అందంగా కనిపించేటప్పుడు జుట్టు( Hair ) కూడా అందంగా ఉండడం ఎంత ముఖ్యం.ముఖ సౌందర్యంలో జుట్టు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ప్రస్తుతం 20 నుంచి 25 సంవత్సరాల వయసులో జుట్టు నెరిసిపోవడం సాధారణ సమస్యగా మారిపోయింది.దీనికి కారణం మన జీవనశైలి మరియు చెడు ఆహారపు అలవాట్లే అని కచ్చితంగా చెప్పవచ్చు.

తెల్ల జుట్టు( White Hair ) కారణంగా చాలా మంది యువకులు ఇబ్బంది పడుతున్నారు.మరియు వీరిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతోంది.

Advertisement

టీ ఆకుల సహాయంతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.భారత దేశంలో నీటి తర్వాత అత్యధికంగా వినియోగించబడే పానీయం టీ.

ఇప్పుడు మీరు తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి ఈ టీ నీటిని ఉపయోగించవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే టీ ఆకును( Tea ) ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్ని పోషకాలు టీ ఆకులలో ఉంటాయి.ఇది మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.వీటిలో నత్రజని 4%, పొటాషియం 0.25%, మరియు భాస్వరం 0.24% ఉంటాయి.

టీ ఆకులు సహజమైన నలుపు రంగును కలిగి ఉంటాయి.దాని సహాయంతో తెల్ల జుట్టు వదిలించుకోవడం సులభం అవుతుంది.అయితే దీన్ని ఎలా ఉపయోగించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

జుట్టు కోసం టీ ఆకులను పొడిని నేరుగా జుట్టుకు రాసుకోకూడదు.దీని కోసం గ్యాస్ స్టవ్ మీద ఒక కుండ నీళ్లు తీసుకొని మరిగించాలి.

Advertisement

ఇప్పుడు అందులో నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల టీ పొడి( Tea Powder ) వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

ప్రభావం మరిగింత పెరగాలంటే ఒక టీ స్పూన్ కాఫీ పొడి( Coffee Powder ) కలపడం కూడా మంచిది.ఈ రెండు మిశ్రమాలను బాగా మరిగించాలి.నీరు దాని అసలు పరిమాణంలో సగం అయ్యే వరకు ఉడకబెట్టాలి.

ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేవరకు వేచి చూడాలి.ఇప్పుడు ఈ నీటితో జుట్టును కడగాలి.

అయితే ఈ సందర్భంలో షాంపూ లేదా సబ్బును వేయకూడదని గుర్తుపెట్టుకోవాలి.ఈ ప్రక్రియను వారానికి రెండుసార్లు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

" autoplay>

తాజా వార్తలు