కీళ్ల నొప్పుల నివారిణి కరక్కాయ.. ఎలా వాడాలో తెలుసా?

కీళ్ల నొప్పులు.( Knee Pains ) వ‌య‌సు పైబ‌డిన వారే కాదు ఇటీవ‌ల రోజుల్లో వ‌య‌సులో ఉన్న‌వారు కూడా ఈ స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తున్నారు.

కీళ్ల నొప్పులు తాత్కాలికంగా ఉండొచ్చు లేదా దీర్ఘకాలిక సమస్యగా కూడా మారవచ్చు.అధిక బ‌రువు, ఆర్థరైటిస్, గౌట్, ఇన్ఫెక్షన్లు, వ‌య‌సు, ఆటోఇమ్యూన్ వ్యాధులు, గాయాలు వంటివి కీళ్ల నొప్పులు త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు.

అయితే కీళ్ల నొప్పుల నివారణకు కరక్కాయ( Myrobalan ) చాలా అద్భుతంగా తోడ్ప‌డుతుంది.ఆయుర్వేదంలో క‌ర‌క్కాయ‌ను అత్యంత విలువైన ఔషధంగా పరిగణిస్తారు.

కీళ్ల‌నొప్పులతో బాధ‌ప‌డుతున్న‌వారు పావు టీ క‌ర‌క్కాయ పొడిని కొంచెం తేనెలో( Honey ) క‌లిపి రోజు ఉద‌యం, రాత్రి తీసుకోవాలి.లేదా కషాయం తయారు చేసి తీసుకోవ‌చ్చు.

Advertisement

క‌ర‌క్కాయ పొడిని నీటిలో మరిగించి, వడకట్టి తాగాలి.క‌ర‌క్కాయ‌లో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్లలోని వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

అదే స‌మ‌యంలో యూరిక్ యాసిడ్ నియంత్రణలో క‌ర‌క్కాయ తోడ్ప‌డుతుంది.గౌట్ సమస్యతో వచ్చే కీళ్ల నొప్పిని తగ్గిస్తుంది.

అలాగే క‌ర‌క్కాయ క‌షాయం తాగ‌డం వ‌ల్ల శరీరంలోని విషపదార్థాల‌న్ని బయటకు వెల్లిపోతాయి.రక్తశుద్ధి జ‌రుగుతుంది.క‌ర‌క్కాయ యొక్క డిటాక్సిఫైయింగ్ గుణాలు మూత్రాశయ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి.

మూత్రంలో మంట, ఇత‌ర‌ మూత్రసంబంధ సమస్యలకు చెక్ పెడ‌తాయి.చ‌ర్మ ఆరోగ్యానికి కూడా కర‌క్కాయ ఎంతో మేలు చేస్తుంది.

హామీ నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్ఆర్ఐ సలహా కమిటీ ఏర్పాటు
అనిల్ రావిపూడి సినిమాలో చిరంజీవి కత్తి పట్టబోతున్నాడా..?

నిత్యం క‌ర‌క్కాయ క‌షాయం తాగితే చర్మ అలర్జీలు, ఎగ్జిమా, పొడి చర్మం, పింపుల్స్‌, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, సోరీయాసిస్ వంటి సమస్యలు దూరం అవుతాయి.

Advertisement

కర‌క్కాయ క‌షాయంతో నోటిని పుక్క‌లిస్తే.నోటి పూత‌, చిగుళ్ల వాసు, చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం వంటివి ప‌రార్ అవుతాయి.గుండె ఆరోగ్యానికి కూడా క‌ర‌క్కాయ ఎంతో మేలు చేస్తుంది.

క‌ర‌క్కాయ పొడిని తేనెలో క‌లిపి నిత్యం తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గ‌ముఖం ప‌డ‌తాయి.ర‌క్తనాళాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

హై బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది.హృద‌య సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

తాజా వార్తలు