మిగిలిపోయిన‌ రైస్ ను పారేస్తున్నారా? ఇలా వాడితే హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టొచ్చు!

సాధారణంగా ప్రతిరోజు అంద‌రి ఇళ్ల‌ల్లోనూ ఎంతో కొంత రైస్ మిగిలిపోతూ ఉంటుంది.

కొందరు ఆ రైస్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని మరసటి రోజు తింటుంటారు.

అయితే మరి కొందరు మాత్రం మిగిలిపోయిన‌ రైస్ ను పారేస్తుంటారు.కానీ ఇకపై అలా చేయకండి.

ఎందుకంటే మిగిలిపోయిన రైస్ తో హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టొచ్చు.అవును మీరు విన్నది నిజమే.

రైస్ లో జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.ముఖ్యంగా జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు రైస్ గ్రేట్ గా సహాయపడుతుంది.

Advertisement

అందుకోసం రైస్ ను ఎలా ఉపయోగించాలి అన్నది ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక అలోవెర ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి లోప‌ల ఉంటే జెల్ ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు మిగిలిపోయిన రైస్ ను వేసుకోవాలి.

అలాగే అర కప్పు కొబ్బరి పాలు, అర కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఒక ఎగ్ వైట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండర్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి ష‌వ‌ర్‌ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారంలో రెండంటే రెండు సార్లు ఈ రైస్ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే కనుక జుట్టు రాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.అదే సమయంలో కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి.మరియు పైన చెప్పిన విధంగా రైస్ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు షైనీగా సైతం మెరుస్తుంది.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

కాబ‌ట్టి, ఇక‌పై మిగిలిపోయిన రైస్ ను డ‌స్ట్ బిన్ లో తోయ‌కుండా హెయిర్ ఫాల్ ను అరిక‌ట్టేందుకు ఉప‌యోగించండి.

Advertisement

తాజా వార్తలు