చిట్లిన జుట్టుతో చింతిస్తున్నారా? అయితే నెయ్యితో ఇలా చేయండి!

సాధారణంగా కొందరి జుట్టు చివర్లు తరచూ చిట్లిపోతూ ఉంటుంది.చిట్లిన జుట్టును క‌త్తిరిస్తూ ఉంటారు.

అయితే ఎన్నిసార్లు ట్రిమ్ చేసిన సరే మళ్లీ మళ్లీ చిట్లి పోతూనే ఉంటుంది.దీని కారణంగా హెయిర్ గ్రోత్ అనేది కూడా ఆగిపోతుంది.

దాంతో చిట్లిన జుట్టు సమస్యను నివారించుకోవడం ముప్ప తిప్ప‌లు ప‌డుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే చిట్లిన జుట్టును రిపేర్ చేయడానికి నెయ్యి ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

నెయ్యిలో ఉండే పలు సుగుణాలు ఈ సమస్య నుంచి చాలా వేగంగా విముక్తిని కలిగిస్తాయి.మరి ఇంతకీ నెయ్యిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక అలోవెరా ఆకు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement
How To Repair Split Ends With Ghee , Split Ends, Hair Care, Hair Care Tips, Ghee

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.

How To Repair Split Ends With Ghee , Split Ends, Hair Care, Hair Care Tips, Ghee

అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అలోవెరా జెల్ ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర అనంతరం మైల్డ్‌ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.అదే సమయంలో మళ్ళీ మళ్ళీ జుట్టు చిట్లకుండా కూడా ఉంటుంది.

How To Repair Split Ends With Ghee , Split Ends, Hair Care, Hair Care Tips, Ghee

పైగా నెయ్యితో పైన చెప్పిన విధంగా హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు స్మూత్ గా సిల్కీగా మరియు షైనీ గా మారుతుంది.చుండ్రు సమస్య ఉంటే క్రమంగా మాయం అవుతుంది.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

కాబట్టి చిట్లిన జుట్టు స‌మస్యతో బాధపడుతున్న వారు మాత్రమే కాదు ఎవరైనా నెయ్యితో పైన చెప్పిన విధంగా హెయిర్ మాస్క్ ను వేసుకోవచ్చు.జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు