చికెన్ పాక్స్ (ఆటలమ్మ) మచ్చలు తగ్గటానికి సులభమైన చిట్కాలు

చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఏర్పడ్డ మచ్చలు చర్మంలో కలిసిపోతాయి.అయితే కొంచెం సమయం పడుతుంది.

ఇవి చర్మంలో కలిసేవరకు ముఖం మీద కనిపిస్తూ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా ఈ మచ్చలు త్వరగా చర్మంలో కలిసేలా చేయవచ్చు.

విటమిన్ కె ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.పాలకూర,టమోటా,లివర్,పాల ఉత్పత్తులు,క్యాబేజీ వంటి వాటిలో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది.

దూదిని ఒక బాల్ గా చేసి కొబ్బరి నీటిలో ముంచి మచ్చలు ఉన్న ప్రాంతంలో రాయాలి.ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా మచ్చలు మాయం అవుతాయి.

Advertisement

గందంలో కాటన్ బాల్ ముంచి మచ్చలపై రాస్తూ ఉంటే కొన్ని రోజులకు మచ్చలు మాయం అవుతాయి.విటమిన్ ఇ అనేది చర్మానికి బాగా సహాయపడుతుంది.

మచ్చలను పోగొట్టటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.నిమ్మరసం,కలబంద కూడా మచ్చలను పోగొట్టటంలో చాలా బాగా పనిచేస్తాయి.

నిమ్మరసాన్ని ప్రతి రోజు మచ్చలపై రాస్తే త్వరగా తగ్గిపోతాయి.అలాగే అలోవెరా జెల్ లను కూడా వాడవచ్చు.

స్నానము చేసే నీటిలో కొన్ని వేప ఆకులను వేసుకోవాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 23, సోమవారం 2023
Advertisement

తాజా వార్తలు