మీరు రోజుకి ఎన్ని పూటలు శరీరానికి ఆహారాన్ని అందిస్తారు? ఈ ప్రశ్న అడిగితే ఠక్కున మూడుపూటలు అని అంటారు.
కాని మన శరీరానికి ఓ రోజులో 8 సార్లు ఆహారాన్ని అందించాలట.
ఇది ఎవరో చెబుతున్న మాట కాదు, డైటిషియన్స్ చెబుతున్న మాట.ఉదయం నుంచి రాత్రి వరకు 8 మీల్స్ బాడికి అవసరం.అలాగని 8 సార్లు దండిగా తినేరు.
కేవలం తినడాన్నే ఆహారం అని అనరు కాదు, ద్రవపదార్థము కూడా అహారమే.ఈరకంగా 8 సార్లు ఎలా తినాలో/తాగాలో .ఏం ఏం తీసుకోవాలో చూద్దాం.1) పొద్దున్నే లేచిన కొద్దినిమిషాల్లో మంచినీళ్ళు తాగి, డీహైడ్రేట్ గా ఉన్న శరీరాన్ని హైడ్రేటెడ్ చేసుకోండి.గత ఏడెనిమిది గంటల్లో మీ శరీరంలోకి ఎలాంటి ద్రవపదార్థము వెళ్ళలేదు కదా.కాబట్టి ఇది అవసరం.ఉదయాన్నే ఆరు గంటలకి నిద్రలేస్తే, 6:15 నిమిషాల సమయంలో ఈ పని చేస్తే సరి.2) పర్సనల్ కార్యక్రమాలు పూర్తిచేసుకోని, 6:45-7.00 నిమిషాల మధ్య కాఫీ, గ్రీన్ లాంటిది తీసుకోండి.టీ/కాఫీ అలవాటు లేకపోతేనే బెటర్.
గ్రీన్ టి, నిమ్మరసం .డిటాక్సిఫీకేషన్ కి పనికొచ్చే ఏదైనా పండ్ల రసం తీసుకోండి.3) 7:30 సమయంలో ఆరోగ్యకరమైన టిఫిన్ తీసుకోండి.నూనె లేని ఇడ్లి అయిన, న్యూట్రీషన్ గల వెజ్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ లాంటిది.4) 10:30 - 11:00 మధ్య నట్స్, బీన్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.కుదిరితే ఓ పది నిమిషాలు ఎండలో నిలబడి విటమిన్ డి పొందాలి.ఉడకబెట్టిన గుడ్డు కూడా తినొచ్చు ఈ సమయంలో.5) 1:00 - 2:00 మధ్యలో లంచ్ చేయండి.రైస్ తీసుకోండి కాని లిమిట్ లో.పెరుగుతో కూడా కలిపి తినండి.కూరల్లో పప్పు ఉండేలా చూసుకోండి.6) 4:00 - 5:00 మధ్య గ్రీన్ టీ తాగితే మేలని డాక్టర్లు చెబుతున్నారు.స్నాక్స్ సమయం కదా అని మసాలా ఉండే ఆహారాన్ని తినేయొద్దు.7) 6:00 - 7:00 మధ్య చపాతి కాని, గోధుమలతో చేసిన ఆరోగ్యకరమైన పదార్థాలని కాని తీసుకోవచ్చు.ఏం తిన్నా, లైట్ గా తినండి.రాత్రి నిద్రకి ఆటంకం కలిగించని ఆహారాన్ని తీసుకోండి.8) 8:00 - 9:00 మధ్య పాలు లేదా పెరుగు తాగండి.శరీరంలో టెంపరేచర్ తక్కువ అవుతుంది.
హాయిగా నిద్రపడుతుంది.ఇదండీ 8 సమయాల్లో మన శరీరానికి ఆహారాన్ని అందించే విధానం.
ఈ డైట్ లో మీకు కావాల్సినన్ని కాలరీలతో పాటు, న్యూట్రింట్స్ కుడా దొరుకుతున్నాయి.పదార్థాలు మార్చినా, ఈ టైమింగ్స్ ఇతర ఆహారపదార్థాలతో (ఆరోగ్యకరమైనవే) పాటించేందుకు ప్రయత్నించండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy