బ‌రువు త‌గ్గ‌డానికి ఇంట్లోనే ప్రోటీన్ పౌడ‌ర్‌ను ఇలా త‌యారు చేసుకోండి!

వెయిట్ లాస్ అవ్వాలంటే శ‌రీరానికి ప్రోటీన్ ఎంతో అవ‌స‌రం.

అందుకే డైట్ ఫాలో అయ్యే వారిలో చాలా మంది మార్కెట్ లో ల‌భ్య‌మ‌య్యే ప్రోటీన్ పౌడ‌ర్స్ పై ఆధార‌ప‌డుతుంటారు.

అయితే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు బ‌య‌ట దొరికేవి కాకుండా ఇంట్లోనే ప్రోటీన్ పౌడ‌ర్ ను త‌యారు చేసుకుని వాడితే మంచిద‌ని అంటున్నారు పోష‌కాహార నిపుణులు.మ‌రి ఇంత‌కీ ఇంట్లోనే ప్రోటీన్ పౌడ‌ర్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని హాఫ్ క‌ప్పు వాల్ న‌ట్స్‌, హాఫ్ క‌ప్పు పిస్తా, హాఫ్ క‌ప్పు జీడి ప‌ప్పులు వేసుకుని చిన్న మంట‌పై ఫ్రై చేసుకుని ప‌క్క‌కు తీసుకోవాలి.మ‌ళ్లీ అదే ప్యాన్‌లో ఒక క‌ప్పు బాదం ప‌ప్పుల‌ను వేసి వేయించుకుని ప‌క్క‌కు తీసుకోవాలి.

ఆ త‌ర్వాత రెండు టేబుల్ స్పూన్ల పుచ్చ గింజ‌లు, రెండు టేబుల్ స్పూన్ల స‌న్ ఫ్లెవ‌ర్ సీడ్స్‌, రెండు టేబుల్ స్పూన్ల గుమ్మ‌డి గింజ‌లు వేసుకుని ఫ్రై చేసి పెట్టుకోవాలి.చివ‌రిగా హాఫ్ క‌ప్పు ఓట్స్ ను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న‌ బాదం, పిస్తా, వాల్ న‌ట్స్‌, జీడిప‌ప్పులు, ఓట్స్‌, పుచ్చ గింజ‌లు, స‌న్ ఫ్లెవ‌ర్ సీడ్స్‌, గుమ్మ‌డి గింజ‌లు వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఈ పొడిని స్ట్రైన‌ర్ సాయంతో జ‌ల్లించి.ఆపై అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడ‌ర్‌ను యాడ్ చేస్తే ప్రోటీన్ పౌడ‌ర్ సిద్ధం అవుతుంది.ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడ‌ర్‌ను రోజుకు ఒక స్పూన్ చ‌ప్పున పాల‌తో క‌లిపి తీసుకోవాలి.

త‌ద్వారా వేగంగా బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు హెయిర్ ఫాల్ స‌మ‌స్య దూరం అవుతుంది.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.

మెద‌డు ప‌నితీరు చురుగ్గా మారుతుంది.మ‌రియు ఎముక‌లు, దంతాలు దృఢంగా సైతం మార‌తాయి.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు