ముఖాన్ని వైట్‌గా, బ్రైట్‌గా మెరిపించే బీట్‌రూట్ సీర‌మ్‌.. ఇలా చేసుకోండి!

బీట్ రూట్.ఆరోగ్యానికి ఇది చేసే మేలు, అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

రోజుకు ఒక బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతుంటారు.అలాగే చర్మ సౌందర్యానికి కూడా బీట్ రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా ముఖాన్ని వైట్ గా మరియు బ్రైట్ గా మెరిపించడానికి బీట్ రూట్ సీర‌మ్‌ గ్రేట్ గా సహాయపడుతుంది.మరి ఇంతకీ బీట్ రూట్ సీర‌మ్‌ను ఏ విధంగా తయారు చేసుకోవాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బీట్ రూట్‌ను తీసుకుని తొక్క తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.

ఇలా కడిగిన బీట్ రూట్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సి జార్‌లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసుకున్న బీట్ రూట్‌ మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.

Advertisement
How To Make Beetroot Serum For Whitening And Brightening Face? Face Whitening, F

అలాగే మ‌రోవైపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ ను పోయాలి.వాటర్ హీట్‌ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

జెల్లీ స్ట్రక్చర్ వచ్చిన వెంట‌నే స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన మిశ్రమాన్ని చ‌ల్లార‌బెట్టుకోవాలి.కంప్లీట్ గా కూల్ అయిన అనంతరం ఓ పల్చటి వస్త్రంలో వేసి జెల్‌ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు జెల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల‌ బీట్ రూట్ జ్యూస్ వేసుకుని నాలుగైదు నిమిషాల పాటు మిక్స్ చేస్తే బీట్ రూట్ సీర‌మ్‌ సిద్ధమైనట్లే.

How To Make Beetroot Serum For Whitening And Brightening Face Face Whitening, F

ఈ సీర‌మ్‌ను ఒక బాటిల్ లో నింపుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు తయారుచేసుకున్న బీట్ రూట్ సీరమ్‌ ను ముఖానికి అప్లై చేసుకుని ప‌డుకోవాలి.ఇలా ప్రతి రోజు కనుక చేస్తే ముఖ చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

చర్మంపై ఏమైనా మచ్చలు ఉన్న క్ర‌మంగా మాయం అవుతాయి.

Advertisement

తాజా వార్తలు