ఈ స్పైసెస్ డైట్‌లో ఉంటే మెటబాలిజం అద్భుతంగా పెరుగుతుంది!

చాలా మంది సూప‌ర్ ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గేందుకు ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

కానీ, మెట‌బాలిజం రేటును పెంచుకుంటే ఎటు వంటి ప్ర‌య‌త్నాలు చేయ‌కుండానే వేగంగా బ‌రువు త‌గ్గొచ్చు.

శ‌రీరంలో కేల‌రీలు ఖ‌ర్చ‌య్యే రేటునే మెట‌బాలిజం అని పిలుస్తారు.మెట‌బాలిజం పెరిగే కొద్ది శ‌రీరంలో కేల‌రీలు త్వ‌ర‌ త్వ‌ర‌గా క‌రుగుతాయి.

అందుకే ఆరోగ్య నిపుణులు సైతం మొట‌ బాలిజంను పెంచుకోవాల‌ని సూచిస్తుంటారు.అయితే అందుకు కొన్ని కొన్ని స్పైసెస్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ స్పైసెస్ ఏంటో ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.యాలకులు.

Advertisement
How To Improve Metabolism With Spices! Metabolism Rate, Metabolism, Spices, Heal

అత్యంత ఖ‌రీదైన స్పైసెస్‌లో ఇవి ఒక‌టి.ధ‌ర ఎక్కువే అయిన‌ప్ప‌టికీ యాల‌కుల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోష‌కాలెన్నో నిండి ఉంటాయి.

ముఖ్యంగా రోజుకు ఒక‌టి లేదా రెండు యాల‌కుల‌ను ఏదో ఒక రూపంలో తీసుకుంటే మొట‌బాలిజం రేటు పెరిగి వెయిట్ లాస్ అవుతారు.అలాగే మొట‌బాలిజం రేటును పెంచ‌డానికి న‌ల్ల మిరియాలూ ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

త‌ర‌చూ న‌ల్ల మిరియాల‌ను తీసుకుంటే గ‌నుక‌.అందులోని ప‌లు పోష‌కాలు శ‌రీరంలోని కేల‌రీల‌ను సూప‌ర్ ఫాస్ట్ గా క‌రిగించేస్తాయి.

అదే స‌మ‌యంలో కొత్త కొవ్వు పేరుకోకుండా అడ్డు క‌ట్ట వేస్తాయి.మెటబాలిజాన్ని బూస్ట్ చేసి వెయిట్ లాస్ ప్రాసెస్ ను వేగ వంతం చేయ‌డానికి చిల్లీ ఫ్లేక్స్ కూడా స‌హాయ‌ప‌డ‌తాయి.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

కాబ‌ట్టి, వీటిని రోజూవారీ వంట‌ల్లో వేసుకుని తీసుకుంటే చాలా మంచిద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

How To Improve Metabolism With Spices Metabolism Rate, Metabolism, Spices, Heal
Advertisement

జాజికాయతో త‌యారు చేసిన టీని వారంలో మూడు సార్లు తీసుకోవ‌డం ద్వారానూ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది.దాంతో శ‌రీరంలో ఉన్న కొవ్వు ఎఫెక్టివ్ గా కరుగుతుంది.ఇక ఇవే కాకుండా ప‌సుపు, దాల్చిన చెక్క‌, జీల‌క‌ర్ర‌, మెంతులు, ల‌వంగాలు, ధ‌నియాలు వంటి వాటిని డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్లా మెట‌బాలిజం పెరుగుతుంది.

తాజా వార్తలు