కాలేయ మంట ఎందుకు వ‌స్తుంది..? ఎలా త‌గ్గించుకోవాలి..?

కాలేయ మంట‌.ఎంద‌రినో వేధించే స‌మ‌స్య ఇది.

మ‌ధ్యపానం, ధూమ‌పానం, చక్కెర ఎక్కువగా తీసుకోవడం, రాత్రుళ్లు హెవీగా ఫుడ్ తిన‌డం, జంక్ ఫుడ్‌, శ‌రీరానికి ప‌రిప‌డా నీటిని అందించ‌క‌పోవ‌డం, పెయిన్ కిల్ల‌ర్స్‌ను ఓవ‌ర్‌గా యూజ్ చేయ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కాలేయ మంట ఏర్ప‌డుతుంటుంది.

ఇది కాలేయ ఆరోగ్యం దెబ్బ తినిందనడానికి సంకేతం.

అందుకే కాలేయ మంట‌ను పొర‌పాటున‌ కూడా నిర్ల‌క్ష్యం చేయ‌రాదు.ప్రారంభ ద‌శ‌లోనే దీనిని త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ ఫుడ్స్ ఏంటో లేట్ చేయ‌కుండా తెలుసుకుందాం ప‌దండీ.న‌ట్స్‌.

Advertisement
How To Get Rid Of Liver Inflammation! Liver Inflammation, Latest News, Health Ti

కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా బాదం, వాల్ న‌ట్స్‌, పిస్తా వంటి న‌ట్స్‌ను ప్ర‌తి రోజు తీసుకుంటే.

శ‌రీరానికి కావాల్సిన బోలెడ‌న్ని పోష‌కాలు ల‌భిస్తాయి.అదే స‌మ‌యంలో కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డి మంట త‌గ్గు ముఖం ప‌డుతుంది.

కాఫీ ఆరోగ్యానికి మంచిది కాద‌ని అంటుంటారు.కానీ, రోజుకు ఒక క‌ప్పు మించకుండా తీసుకుంటే.

కాఫీలో ఉండే పాలీఫెనాల్స్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కాలేయ మంట నుంచి ఉప‌శ‌మనాన్ని అందిస్తాయి.పాల‌కూర‌, మెంతికూర‌, చుక్క‌కూర‌, బ‌చ్చ‌లికూర వంటి ఆకుకూర‌ల‌ను వారంలో కనీసం రెండు సార్లు అయినా తినాలి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

త‌ద్వారా వాటిలో ఉండే ప‌లు పోష‌కాలు దెబ్బ తిన్న లివ‌ర్‌ను మ‌ళ్లీ హెల్తీగా మారుస్తాయి.ఫ‌లితంగా కాలేయ మంట స‌మ‌స్య దూరం అవుతుంది.

How To Get Rid Of Liver Inflammation Liver Inflammation, Latest News, Health Ti
Advertisement

ప‌సుపును ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.దాంతో అందులో ఉండే శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయ మంట‌ను స‌మ‌ర్థ‌వంతంగా త‌గ్గిస్తాయి.ఇక గ్రేప్స్‌, బీట్‌రూట్‌, క్యాబేజీ, కాలీఫ్లవర్, అవ‌కాడో, వెల్లుల్లి వంటి వాటిని కూడా డైట్‌లో చేర్చుకోవాలి.

రెగ్యుల‌ర్‌గా వ్యాయామాలు చేయాలి.మ‌ద్య‌పానం, ధూమ‌పానం అల‌వాట్ల‌ను మానుకోవాలి.

వాట‌ర్ అధికంగా సేవించాలి.త‌ద్వారా కాలేయ మంట నుంచి విముక్తి ల‌భిస్తుంది.

తాజా వార్తలు