చుండ్రును త‌రిమికొట్టే ఆరెంజ్ పీల్.. ఎలా వాడాలంటే..?

మనలో చాలా మంది అత్యంత కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో చుండ్రు( Dandruff ) ఒకటి.

తలలో చుండ్రు ఉండటం వల్ల తీవ్ర సౌకర్యానికి గురవుతుంటారు.

చుండ్రు కారణంగా దురద, అధిక హెయిర్ ఫాల్, డ్రై హెయిర్( Hair fall, dry hair ) వంటి ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందుకే చుండ్రును వదిలించుకునేందుకు నానా అవస్థలు పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు ఆరెంజ్ పీల్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.సాధారణంగా ఆరెంజ్ పండ్లను తినేటప్పుడు తొక్క తీసి బయట పారేస్తుంటారు.

కానీ ఆరెంజ్ పండు మాత్ర‌మే కాదు ఆరెంజ్‌ తొక్కలు( Orange peels ) కూడా మ‌న‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ఆరెంజ్ తొక్కలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఎ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి.

Advertisement
How To Get Rid Of Dandruff With Orange Peel! Dandruff, Orange Peel, Orange Peel

ఇవి మ‌న చ‌ర్మంతో పాటు జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా తోడ్ప‌డ‌తాయి.ముఖ్యంగా చుండ్రును త‌రిమికొట్ట‌డానికి ఆరెంజ్ పీల్ స‌హాయ‌ప‌డుతుంది.

మరి ఇంతకీ త‌ల‌కు ఆరెంజ్ పీల్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ప‌దండి.

How To Get Rid Of Dandruff With Orange Peel Dandruff, Orange Peel, Orange Peel

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఆరెంజ్ తొక్కలు వేసుకుని వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఆరెంజ్ తొక్కల‌ను వాటర్ తో సహా వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( curd ) మరియు రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం ( lemon juice ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

How To Get Rid Of Dandruff With Orange Peel Dandruff, Orange Peel, Orange Peel
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే పరార్ అవుతుంది.

Advertisement

కేవలం రెండు మూడు వాషుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గ‌మ‌నిస్తారు.చుండ్రును దూరం చేసుకోవ‌డానికి ఈ ఆరెంజ్ పీల్ హెయిర్ మాస్క్ ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డుతుంది.కాబ‌ట్టి త‌ప్ప‌క ట్రై చేయండి.

తాజా వార్తలు