ముఖ్య గమనిక- శివరాత్రికి ఉపవాసం చేస్తున్నారా... అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే

శివరాత్రి అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఉపవాసం,జాగరణ.జాగరణ చేసిన చేయకపోయినా ఉపవాసం మాత్రం చాలా మంది చేస్తూ ఉంటారు.

శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే చేసిన పాపాలు పోవటమే కాకుండా సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.శివరాత్రికి ఉపవాసం చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.

How To Do Maha Shivaratri Fasting-How To Do Maha Shivaratri Fasting-Devotional-T

ఉపవాసం చేయటానికి ముందు కొన్ని రోజుల పాటు పిండి పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటే శరీరం బలంగా ఉంటుంది.ఉపవాసం చేసే ముందు కడుపు నిండుగా మంచినీళ్లు త్రాగాలి.

ఖర్జూరాలు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ తినవచ్చు.అలాగే పాలు,పండ్లను కూడా తీసుకోవచ్చు.

Advertisement

ఆకుకూరలను సూప్ గా చేసుకొని త్రాగవచ్చు.మంచి నీటిని ఎక్కువగా త్రాగాలి.

ఆలా అని ఒకేసారి ఎక్కువగా త్రాగకూడదు.కొంచెం కొంచెంగా త్రాగుతూ ఉండాలి.

నీటిలో ఖర్జురాలను నానబెట్టి ఆ నీటిని రోజు మధ్య మధ్యలో త్రాగుతూ ఉండాలి.ఉప్పు వేసిన పల్చని మజ్జిగ కూడా త్రాగవచ్చు.

ఉపవాసం చేసే వారు శారీరక శ్రమకు దూరంగా ఉండాలి.ఉపవాసం చేయటం వలన శరీరం నీరసిస్తుంది.

మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత చిట్కాలు..!

అందువల్ల మధ్య మధ్యలో పండ్లను తీసుకోవాలి.ఉపవాసం చేస్తున్నామని కొంతమంది వేసుకోవలసిన మందులను మానేస్తు ఉంటారు.

Advertisement

ఆలా చేయటం చాలా తప్పు.వేసుకోవలసిన మందులను తప్పనిసరిగా వేసుకోవాలి.

ఉపవాసం అయ్యిన వెంటనే ఎక్కువ ఆహారం తీసుకోకూడదు.కొంచెం కొంచెంగా తీసుకోవాలి.

ఉపవాసం చేసేటప్పుడు తరచూ కునుకు తీయాలి.ఇలా చేయడం వల్ల విశ్రాంతి దొరికి హుషారుగా ఉంటారు.

ఉపవాసం చేయటం వలన ఏకాగ్రత పెరుగుతుంది.శరీర బరువుతో పాటు, ఫ్యాట్‌ కూడా తగ్గుతుంది.

బ్లడ్‌షుగర్‌ ప్రమాణాలు తగ్గుతాయి.ఇన్సులిన్‌ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

ఎనర్జీ ప్రమాణాలను పెంచుతుంది.కొవ్వును కరిగిస్తుంది.

బ్లడ్‌ కొలె స్ట్రాల్‌ను తగ్గిస్తుంది.అల్జీమర్స్ జబ్బును నిరోధిస్తుంది.

ఉపవాసం చేయకూడని వారు చిన్నపిల్లలు,గర్భిణీ స్త్రీలు,అనారోగ్యంతో ఉన్నవారు, ,వయస్సు పైబడిన వారు,రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితిలోను ఉపవాసం చేయకూడదు.

తాజా వార్తలు