Maha Shivaratri : శివరాత్రికి ఉపవాసం చేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!

మహాశివరాత్రి( Maha Shivaratri ) హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ అని దాదాపు చాలామందికి తెలుసు.

ఇది రాత్రిపూట చేసుకునే పండుగ ఉదయం శివుడిని పూజించి ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు.

ఉదయం శివుడిని( Lord Shiva ) పూజించాకే ఉపవాసాన్ని ముగిస్తారు.కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న హిందువులకు ఇది ఒక ప్రత్యేకమైన పండుగ.

దీన్ని గొప్ప అంకిత భావంతో నిర్వహించుకుంటూ ఉంటారు.ఈ పండుగ అమావాస్యకు ముందు రోజు, ఫాల్గుణ మాసం లేదా మాఘ మాసంలో 14వ రోజున వస్తుంది.

మహాశివరాత్రి రోజు ఉదయం ఉపవాసం చేయడం వల్ల ఎంతో పవిత్రత వస్తుందని చెబుతున్నారు.అందుకే హిందువులంతా ఆ రోజు ఉపవాసం ఉండి జాగారం ఉంటారు.

Advertisement

ఆ ఒక్క రోజు ఉపవాసం( Fasting ) ఉండి జాగారం చేస్తే సంవత్సరం అంతా శివుడిని ఆరాధించిన పుణ్యం దక్కుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.అలాగే అన్ని పాపాలకు మోక్షం లభిస్తుందని, విముక్తి కలుగుతుందని నమ్ముతారు.

స్కంద పురాణం, లింగపురాణం, పద్మ పురాణంతో పాటు అనేక పురాణాలలో ఈ మహాశివరాత్రి ప్రస్తావన ఉంటుందని నిపుణులు చెబుతున్నారు .మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి.

ఉపవాసం ఉండడం వల్ల శరీరం మనసు శుద్ధి అవుతుంది.శరీరంలో, మనసులో ఉన్న వ్యర్ధాలు, మలినాలు బయటికి వెళ్లిపోతాయి.కొంతమంది భక్తులు పూర్తిగా ఆహారం, నీరు, తాగకుండా ఉపవాసం చేస్తారు.

మరి కొందరు మాత్రం కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటారు.అయితే ఏలాంటి ఆహారాలు మహాశివరాత్రి రోజు తినవాచ్చో ఏలాంటి ఆహారాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
నాగుల చవితి నాడు పుట్టకు పూజలు చేస్తే పుణ్యమా ?

ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని రకాల ఆహారాలు ఉపవాసం చేసిన రోజు తినవచ్చు.అవి సగ్గుబియ్యం, మినుములు, గుమ్మడికాయ, బంగాళదుంపలు, ఫుల్ మఖాన, అరటిపండు, పెరుగు( Curd ) వంటివి తీసుకోవచ్చు.

Advertisement

వీటితో చేసినా కొన్ని రకాల ఆహారాలను కొద్దికొద్దిగా తీసుకోవచ్చు.అయితే గోధుమలు, బియ్యం, కూరగాయలు, పప్పులు వంటి ఆహారాలకు మాత్రం దూరంగా ఉండాలి.అయితే ఉపవాసం చేయని వారు మహాశివరాత్రి రోజు కచ్చితంగా మాంసాహారము, ఉల్లిపాయలు, వెల్లుల్లి అస్సలు తీసుకోకూడదు.

శివునికి నైవేద్యంగా కొన్ని రకాల ప్రసాదాలను పెట్టడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.శివయ్య మనకు విజయాన్ని, శాంతిని, ఆనందాన్ని, శ్రేయస్సును అందిస్తారు.అలాంటి శివునికి బియ్యముతో వండిన ఆహారాలు( Rice Items ), పాలు పెరుగు వంటి వాటిని సమర్పిస్తే మంచిది.

ముఖ్యంగా పాలతో చేసిన మిఠాయిలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తే ఎంతో పుణ్యం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు