మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్బాశ‌య క్యాన్స‌ర్ ముప్పు.. ముందుగా గుర్తించ‌డం ఎలా?

మ‌హిళ‌ల్లో గ‌ర్బాశ‌య క్యాన్స‌ర్( Cervical cancer ) ముప్పు నానాటికీ పెరిగిపోతోంది.ఇది ముఖ్యంగా గర్భాశయాన్ని కప్పి ఉంచే ఎండోమెట్రియం అనే పొరలో వృద్ధి చెందుతుంది.

గర్భాశయ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం చాలా కీలకం.కానీ స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల ఎక్కువ శాతం మంది గ‌ర్బాశ‌య క్యాన్స‌ర్ ను ముందుగా గుర్తించలేక‌పోతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే గ‌ర్బాశ‌య క్యాన్స‌ర్ ఎందుకు వ‌స్తుంది? ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు ఏంటి.? వంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ త‌లెత్త‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.

హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు, ఎక్కువ కొవ్వు శాతం ఉన్న ఆహారం తీసుకోవడం, పీసీఓఎస్‌(పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్), ధూమ‌పానం, మ‌ద్య‌పానం వంటి చెడు వ్య‌స‌నాలు, డయాబెటిస్, హైపర్ టెన్ష‌న్‌ వంటి ఆరోగ్య సమస్యలు మ‌హిళ‌ల్లో గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ రిస్క్ ను పెంచుతాయి.అలాగే మెనోపాజ్ ( Menopause )తర్వాత ఎస్ట్రోజెన్ స్థాయిలు మారుతాయి, ఇది గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం అవుతుంది.

Advertisement

కుటుంబంలో గర్భాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్ ఉంటే మీకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.

50 నుంచి 70 సంవత్సరాల మహిళలకు గ‌ర్బాశ‌య క్యాన్స‌ర్ వ‌చ్చే ప్రమాదం చాలా అధికంగా ఉంటుంది.40 నుంచి 50 సంవత్సరాల మహిళల‌కు మితమైన ప్రమాదం ఉంటే.30 నుంచి 40 సంవత్సరాల మహిళలకు కొంచెం తక్కువ అవకాశం ఉంటుంది.30 ఏళ్లలోపు మ‌హిళ‌ల‌కు చాలా అరుదుగా గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ వ‌స్తుంది.

నెలసరి తర్వాత లేదా మెనోపాజ్ తర్వాత అసాధారణ రక్తస్రావం, లైంగిక సంబంధం సమయంలో నొప్పి లేదా ర‌క్త‌స్రావం( Bleeding ), మూత్ర విసర్జనలో ఇబ్బంది, కడుపు నొప్పి, వీక్‌నెస్, ఆకలి తగ్గడం, స‌డెన్ గా వెయిట్ లాస్ అవ్వ‌డం, కడుపు భాగంలో లేదా శరీరంలో నిరంతర నొప్పి గ‌ర్బాశ‌య క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు.ఈ లక్షణాలు ఉన్నవారు తక్షణమే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.అల్ట్రాసౌండ్, బయోప్సీ, సి టి స్కాన్ ద్వారా గర్భాశయంలో అసాధారణ మార్పులు, క్యాన్సర్ కణాల నిర్ధారణ మ‌రియు వ్యాప్తిని తెలుసుకోవ‌చ్చు.

త్వరగా క్యాన్స‌ర్ ను గుర్తిస్తే చికిత్స మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

రామ్ చరణ్ ఆ దర్శకుడిని నెగ్లేట్ చేశాడా..?
Advertisement

తాజా వార్తలు