నిద్ర పట్టడం లేదా..ఇవి పాటించండి చాలు

మనలో చలా మందికి సరిగా నిద్రపట్టదు,అలాంటి వారు నిద్రలోకి జారుకోవడానికి ఒక్కోసారి తెల్లవారు జాము అయిపోతుంది.

ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా వారికి సంపూర్ణ నిద్ర దొరకదు.

ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో ఉంటుంది.వయసులో మార్పులు, వృత్తిలో ఒత్తిళ్లు, మానసిక సమస్యలు వెరసి మనకు నిద్ర కరువైపోతోంది.

Reasons For Enough Sleep, Sleeping Tips, Health, Telugu Health Tips-నిద్

సుఖ నిద్ర కావాలంటే ఏం చేయాలి? అసలు నిద్ర ఎందుకు పట్టదు? కారణాలు ఏమైనా సరే ఈ సమస్యని అధిగమించే మందు మనచేతిలోనే ఉంది.నిద్రపోయే ముందు అతిగా తినకూడదు ,మితంగా ఆహరం తీసుకుంటే మంచిది ,అలాగే భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు,నీటిని ఎక్కువగా తీసుకోకూడదు.

అలాగే కాఫీ,టీ , డ్రింక్స్,సిగరెట్స్ వంటి వాటిని నిద్ర ముందు సేవించకూడదు.నిద్రపోయే ముందు చదవడం, టీవీ చూడడం, సెల్‌ఫోన్లు వాడటం ఇలా చేస్తే నిద్ర పట్టకపోవడమే కాదు కంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

Advertisement

దిండ్ల కింద ఎలాంటి వస్తువులు ఉంచకండి.తలగడ లేకుండా పడుకోవడం వల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది.మనం పడుకునే ప్రదేశం నిశ్శబ్దంగా,చీకటిగా ఉండాలి ఎందుకంటే నిద్రపట్టడానికి సహకరించే మెలటోనిన్ హార్మోన్ చీకటిలోనే ఉత్పత్తి అవుతుంది.

ఆలోచనలు ఎక్కువైనా నిద్రపట్టదు.కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలి.

ఇలా చేస్తే మనిషి శారీరక,మానసిక జబ్బుల బారినపడే అవకాశం తక్కువ.దైనందిన జీవితంలో కంటినిండా చక్కని నిద్ర ఉంటే ఎటువంటి సమస్యలు రావు, సరైన నిద్రవలన ఆరోగ్యం పధిలంగా ఉంటుంది.

తాజా వార్తలు