డైరెక్టర్ ని చూడటానికి వెళ్లి హీరోయిన్ గా అయిపోయింది ... ఎలాగో తెలుసా?

హీరోయిన్ సమంత( Samantha ) తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏ మాయ చేసావే( Ye Maaya Chesave ) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ చిత్రంలో నాగచైతన్యతో కలిసి నటించిన సమంత ఆ తర్వాత అతనితో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని కొన్నేళ్ళకు విడాకులు కూడా తీసుకుంది.

ప్రస్తుతం వారి పర్సనల్ లైఫ్ గురించి చర్చ అనవసరం కానీ ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కావడం సమంత చేసుకున్న అదృష్టమని చాలా మంది అంటూ ఉంటారు.నిజానికి సమంత అసలు ఈ సినిమాలో నటించాలనే ఉద్దేశంతో ఏ రోజు లేదట.

అలాగే గౌతమ్ మేనని కూడా సమంతాను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోలేదట.వీరి ఇద్దరి కలయిక చాలా విచిత్రంగా జరిగింది.

అలాగే ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప నటి కూడా దొరికింది.

How Samantha Casted In Ye Maaya Chesave ,samantha, Ye Maaya Chesave, Naga Chaita
Advertisement
How Samantha Casted In Ye Maaya Chesave ,Samantha, Ye Maaya Chesave, Naga Chaita

చిన్నతనం నుంచి గౌతమ్ మీనన్ సినిమాలు చూస్తూ పెరిగిన సమంతకి ఆయనంటే చాలా అభిమానం ఉండేదట.అందుకే ఒకసారైనా అతనిని కలిసి ఒక ఫోటో దిగాలని అనుకుందట.గౌతమ్ మీనన్( Gautham Menon ) తో సినిమాలు తీయడం సంగతి అటు పెట్టి కేవలం కలిస్తే చాలు అనుకునే రోజుల్లో ఏ మాయ చేసావే సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయట.

సరిగ్గా ఆ టైంకి ఎవరిని తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో గౌతమ్ మీనన్ ఉన్నారట.అయితే గౌతమ్ మీనన్ ని కలవడానికి ఛాన్స్ దొరకడంతో సమంత కూడా వెళ్ళిందట.

ఒక అభిమానిగా ఆయన్ని కలిసి ఒక ఫోటో తీసుకొని వద్దామనుకొని వెళ్లిన సమంతకి ఏకంగా సినిమా ఆఫర్ ఇచ్చేశారు గౌతమ్ మీనన్.

How Samantha Casted In Ye Maaya Chesave ,samantha, Ye Maaya Chesave, Naga Chaita

చూడటానికి చాలా చక్కగా ఉన్నావు నీకు సినిమాలో అవకాశం ఇస్తాను చేస్తావా అని అడిగారట.దాంతో ఎగిరి ఎంత వేసి సమంతా ఓకే చెప్పారు.అలా ఏ మాయ చేసావే సినిమా కోసం ఆమె సెలెక్ట్ అయింది.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

అయితే కేవలం చూడడానికి మాత్రమే వెళ్లిన సమంతా హీరోయిన్ గా గౌతమ్ మీనన్ సెలెక్ట్ చేయడం కూడా చాలా పెద్ద విషయమే.డైరెక్ట్ ని కలవడానికి వెళ్తే ఏకంగా హీరోయిన్ అయిపోయినట్టుగా ఉంది సమంత పరిస్థితి.

Advertisement

ఇప్పటికి గౌతమ్ మీనన్ పిలిచి ఏ చిన్నవేశం అడిగినా కూడా చేయడానికి తను రెడీగా ఉంటాననే విషయం కూడా సమంత ఎన్నో పబ్లిక్ స్టేజెస్ పై చెప్పడం జరిగింది.

తాజా వార్తలు