శ్రీ కృష్ణ పరమాత్ముడి అన్న బలరాముడికి అన్ని పేర్లు ఉన్నాయా?

దేవకీ వసుదేవుల పెద్ద కుమారుడు, శ్రీ కృష్ణ పరమాత్ముడి అన్న బల రాముడు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే.

వీరికి ఒక చెల్లెలు సుభద్ర కూడా ఉంది.

కానీ అన్నాదమ్ములిద్దరూ దేవకీ వసుదేవుల వద్ద కాకుండా యశోదా నందుల వద్ద వ్రేపల్లెలో పెరిగారు.కానీ ఆయనకు ఎన్ని పేర్లు ఉన్నాయనే విషయం మాత్రం చాలా మందికి తెలీదు.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.బల రాముడికి మొత్తం 13 పేర్లు అన్నాయి.

అందులో మొదటిది బల భద్రుడు.రెండోది ప్రలంభఘ్నుడు.

Advertisement

మూడోది బల దేవుడు.నాలుగోది అచ్యుతాగ్రజుడు.

ఐదోది రేవతీ రమణుడు.ఆరోది కామ పాలుడు.

ఏడోది హలాయుధుడు.ఎనిమిదోది నీలాంబరుడు.

తొమ్మిదోది రోహిణేయుడు.పదోది తాలంకుడు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి27, సోమవారం 2025

అంటే తాటి చెట్టు గుర్తు కలవాడని అర్థం.పదకొండోది సంకర్షణుడు.

Advertisement

ఒక గర్భం నుంచి మరొక గర్భానికి లాగబడిన వాడని అర్థం.పన్నెండోది సీరపాణి, పదమూడోది కాళినేఛేదనుడు.

అంటే కాళిందిని భంగ పరచినవాడని అర్థం.

బలరాముడు ఎప్పుడూ శ్రీ కృష్ణుడితోనే ఉండేవాడు.అన్ని వేలళా తోడుగా ఉంటూనే తమ్ముడిని ‌ప్రేమగా చూసుకునేవారట.ఈయన భార్య పేరు రేవతి.

ఇతడి ఆయుధం నాగలి.ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశనే మార్చారని పురాణాలు చెబుతున్నాయి.

మరో సారి హస్తినాపురాన్నే తన ఆయుధమైన నాగలితో యమునలో కలపాలని చూశారట.అంతే కాకుండా వీరు కురక్షేత్ర యుద్ధమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేశారని పురాణాలు చెబుతున్నాయి.

తాజా వార్తలు