సూర్యకాంతం అనర్గళం గా ఎన్ని భాషలు మాట్లాడేదో తెలుసా?

సూర్యకాంతం.పాత తరం జనాల్లో ఈమె గురించి తెలియని వాళ్లు ఉండరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

పెద్ద పెద్ద రౌడీలను చూడ్డం కంటే సూర్యకాంతంను చూస్తేనే వణుకుపుడుందనే వారు మన పెద్దలు.ఆమెను చూడగానే పెద్ద నోరేసుకుని పడిపోయే గయ్యాళిగానే అందరం భావిస్తాం.

కానీ ఆమె నట జీవితానికి, నిజజీవితానికి అసలు పోలికే లేదంటారు ఆమె కుమారుడు పద్మనాభమూర్తి.తను అత్యంత సౌమ్యురాలని చెప్తారు ఆయన.తన తల్లికి ఆరేండ్ల వయసు ఉన్నప్పుడే తాతయ్య చనిపోయాడు.వాళ్ల పెద్దక్క, బావల దగ్గర పెరిగింది.

అమ్మ అల్లరిగా ఉండటం వల్లనో ఏమో చదువు అబ్బలేదు.సినిమాల మీద ఇష్టంతో అమ్మమ్మతో కలిసి మద్రాసుకు వెళ్లింది.1946 నారదనారది అనే సినిమా ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టింది.హీరోయిన్ గా చేయాలనున్నా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయింది.1962లో విడుదలైన గుండమ్మ కథ చిత్రంతో గయ్యాళి పాత్రలకు చిరునామాగా మారిపోయింది.డైలాగ్‌ పలకడంలో విచిత్రమైన మాట విరుపు, ఎడమ చేతివాటం ఆమెను గొప్ప నటిని చేశాయి.

Advertisement
How Many Languages Suryakantham Known, Suryakantham, Languages Known, More Than

సూర్యకాంతానికి చదువు లేదు కానీ.పది భాషలు అవలీలగా మాట్లాడగలదు.

పత్రికలు, పుస్తకాలు, నవలలు బాగా చదివేది.ఉన్నంతలో దానధర్మాలు చేసేది.

చిన్నపత్రికలకు ఆర్థికంగా సహాయపడేది.సూర్యకాంతం అనర్గళంగా పదికి పైగా భాషలు మాట్లాడేవారట.

How Many Languages Suryakantham Known, Suryakantham, Languages Known, More Than

శత్రువు ఇంటికి వచ్చినా వాళ్లని ఆదరించి అన్నం పెట్టేది సూర్యకాంతం నలుపు రంగంటే అస్సలు ఇష్టం లేదామెను.ఒకసారి లైట్‌ బ్లూ కలర్‌ కారు బుక్‌ చేస్తే వాళ్లు బ్లాక్‌ కలర్‌ ఇచ్చారు.అప్పుడు గొడవ పెట్టి మార్చుకుంది తను.తనే స్వయంగా కారు డ్రైవ్‌ చేసేది.తన చేతి వంట అమృతంలా ఉండేదనుకునేవారు సినిమా వారంతా.

అందమైన ముఖ చర్మానికి పాల పేస్ పాక్స్

ఆమెకు బయట తిండి తినే అలవాటు లేదు.అందుకే షూటింగులకు వెళ్లేటప్పుడు తనకు మాత్రమే కాకుండా, షూటింగ్‌లో ఉన్న మిగతా వాళ్ల కోసమూ వంట చేసి తీసుకెళ్లేది.

Advertisement

తన రాక కోసం అందరూ ఎదురు చూసేవారు.ఎన్‌టిఆర్‌ సైతం సూర్యకాంతం వంటను ఎంతో ఇష్టంగా తినేవారట.1994లో సూర్యకాంతం కన్నుమూసింది.తను చనిపోయి పాతికేళ్లు దాటినా సూర్యకాంతం అబ్బాయిగా తాను పొందే ప్రేమాభిమానాలతో కూడిన గౌరవ మర్యాదలు ఎంతో గొప్పవి అంటారు పద్మనాభమూర్తి.

తాజా వార్తలు