ఒక్క మాట కోసం 10 లక్షల రూపాయలను జమున ఎలా వదులుకుందో తెలుసా ?

జమున ఖచ్చితత్వానికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అంటూ ఉంటారు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా.

ఆమె ఒకసారి ఒక మాట చెప్పిందంటే అదే మాటపై నిలబడటానికి శాయశక్తుల ప్రయత్నిస్తుందట.

మాట దాటేవాళ్లు, అబద్ధాలు చెప్పే వాళ్ళు అంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు.జమున చనిపోయిన తర్వాత ఆమె గురించి చాలా వార్తలు వస్తున్నాయి.

ఇండస్ట్రీలో పెద్దలుగా చెప్పుకుంటున్న ఎవరూ కూడా ఆమెను చివరి చూపు చూడ్డానికి వెళ్లకపోవడంతో సోషల్ మీడియాలో ఈ వార్తల వెల్లువ మరింత పెరిగింది.ఇక నటి గీతాంజలికి ఇచ్చిన ఒక్క మాట కోసం ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా తనకు ఉన్న ఒక భూమిని అమ్మడానికి ఒప్పుకోని సంఘటన గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.

జమున హీరోయిన్ గా ఆ పీక్ లో ఉన్న సమయంలో చెన్నైలో చాలానే ఆస్తులను కూడబెట్టింది.అలాగే ఆమె టీ నగర్ లో ఒక ఐదు గ్రాండ్ల స్థలం ఉండేది.ఆ స్థలంలో పెట్రోల్ బంకు కోసం అద్దెకు ఇచ్చింది.

Advertisement

అయితే సదరు పెట్రోల్ బంకు వారు ఆ స్థలాన్ని అద్దకు కాకుండా కొనుక్కోవాలని ఆశించారు.అదే సమయంలో ఆమె హైదరాబాద్ కి తన మఖం మార్చడంతో చెన్నై వెళ్లే పరిస్థితులు తగ్గిపోయాయి.

ఆ పరిస్థితులలో ఆ భూమి అవసరం లేదని ఎవరికైనా అమ్మేద్దామని కూడా జమున ఆలోచిస్తోందట.సరిగ్గా హీరోయిన్ గీతాంజలి మరియు అమే భర్త రామకృష్ణ సైతం ఆ భూమి కొనుక్కోవాలని ఆశపడ్డారు.

అందుకోసం జమునను అడగగానే గీతాంజలికి అమ్ముతానని మాట ఇచ్చారట.

అంత విలువచేసే భూమిని గీతాంజలికి తక్కువ ధరకే ఇవ్వడానికి జమున ఒప్పుకున్నారట.అందుకని ఈ కాస్త అడ్వాన్స్ గా అమౌంట్ కూడా తీసుకున్నారట.ఇక గీతాంజలి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆ కొంత మంది ప్రొడ్యూసర్లు ఆ స్థలంపై కన్నేసారు.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ఎలాగైనా ఆ గీతాంజలి కాకుండా తమకు ఆ స్థలాన్ని ఇవ్వాలని 10 లక్షలు ఇస్తామని ఆమెకు ఆశ చూపారట.కానీ అందులో సగం ధరకే గీతాంజలికి అమ్ముతానని మాట ఇచ్చింది కాబట్టి ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా కూడా జమున ఆ ప్రాపర్టీని ఎవ్వరికీ ఇవ్వలేదట.

Advertisement

చివరికి గీతాంజలికి పూర్తిగా డబ్బు తీసుకొని ఆస్తిని ఇచ్చేసిందట.అలా కేవలం ఒక్క మాట కోసం ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఆమె లొంగలేదు.

తాజా వార్తలు