Jagapathi Babu : జగపతి బాబు తండ్రి ఎలా దర్శకుడు అయ్యాడో తెలుసా ?

తెలుగు సినిమా చరిత్రలో ప్రముఖ దర్శక నిర్మాతలలో ఒకరు వీ.బి.రాజేంద్ర ప్రసాద్ ( V.

B.Rajendra Prasad )గారు.ఈ తరం సినీ ప్రేక్షకులకు ఈయన పేరు తెలియకపోవచ్చు.

ఈయన ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు( Jagapathi Babu ) గారి తండ్రి.ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, జగపతి ఆర్ట్స్ సంస్థను స్థాపించి తెలుగు, తమిళ, హిందీ భాషలలో అనేక సినిమాలను నిర్మించడమే కాకుండా, రచించి దర్శకత్వం కూడా చేసారు రాజేంద్ర ప్రసాద్ గారు.

ఆయన జగపతి సంస్థలో మొత్తం 34 చిత్రాలు నిర్మించారు.వీటిలో 24 తెలుగు సినిమాలతో పాటు, తమిళ, హిందీ భాషలలో 10 సినిమాలు ఉన్నాయ్.ఈ 34 సినిమాలలో, 13 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.7 సినిమాలకు రచయత కూడా ఆయనే.మొట్టమొదట 1960 లో "అన్నపూర్ణ" చిత్రంతో నిర్మాతగా మారిన ఆయన అక్కినేని నాగేశ్వరరావు నటించిన "దసరాబుల్లోడు" ( Dasara Bullodu )చిత్రంతో దర్శకుడిగా మారారు.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఐతే ఈయన ఒక నిర్మాత నుంచి దర్శకుడిగా మారడానికి గల కారణాలు, పరిస్థితులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

వీరమాచినేని రాజేంద్ర ప్రసాద్ గారు మద్రాస్ ప్రెసిడెన్సీ లోని గుడివాడ( Gudivada in Madras Presidency ) లో జన్మించారు.వీరి కుటుంబం ధాన్యం వ్యాపారం చేసేవారు.మిల్లులు కూడా ఉండేవి.

కానీ ఈయనకు ఆస్తమా సమస్య ఉండడంతో మిల్లులో పని ఆరోగ్యానికి సరిపడదని, వేరే వ్యాపారం చేసుకోమని చెప్పారు కుటుంబసభ్యులు.ఈయన కాకినాడలో చదువుకునే సమయంలో పూర్ణోదయా క్రియేషన్స్ ఓనర్ ఏడిద నాగేశ్వర్రావు గారు ఈయనకు క్లాస్ మెట్.

ఆ సమయంలోనే అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా వీరికి స్నేహం ఏర్పడింది.అప్పటికే నాగేశ్వరరా గారు హీరో.

వీరిద్వారా మెల్లగా సినిమా రంగంలోకి వెళదాం అన్న ఆలోచన వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారికి.మొదట నటుడు అవుదాం అని వెళ్లిన ఆయన ఒకటి, రెండు ప్రయత్నాలు చేసాక అది తన వల్లకాదని నిర్ణయించుకొని, నిర్మాత అవ్వాలని డిసైడ్ అయ్యారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

అప్పుడే నాగేశ్వర్రావు గారి దగ్గరకు వెళ్లి, మీరు నాకు ఒక సినిమా చెయ్యాలి అని అడిగారు.అప్పుడు ఆయన "ముందు మీరు అనుభవం కోసం ఒక చిన్న సినిమా చేసి రండి.

Advertisement

ఆ తరువాత మనం సినిమా చేద్దాం" అని అన్నారు.అప్పుడు సదాశివబ్రహ్మం అనే రైటర్ దగ్గర "అన్నపూర్ణ" చిత్రం కథ తీసుకొని నిర్మించారు.

ఈ చిత్రాన్ని వీ.మధుసూధనరావు దర్శకత్వం వహించగా, జగ్గయ్య, జమున నటించారు.ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించిన "ఆరాధనా" చిత్రానికి డేట్స్ ఇచ్చారు నాగేశ్వర్రావు గారు.

ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

ఆ తరువాత కొన్నాళ్ళకు మధుసూధనరావు దర్శకత్వంలో, నాగేశ్వరావు హీరోగా "అదృష్టవంతులు" అనే చిత్రాన్ని నిర్మించారు రాజేంద్ర ప్రసాద్ గారు.ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది.ఆ తరువాత అదే కాంబోలో, పల్లెటూరు నేపథ్యంలో ఒక సినిమా చేద్దాం అనుకున్నారు.

అప్పుడే "దసరాబుల్లోడు" కథ సిద్ధం చేసారు.ఐతే ఈ సినిమా ఇప్పట్లో దర్శకత్వం చెయ్యడం కుదరదని అన్నారు మధుసూధనరావు గారు.

అప్పుడు నాగేశ్వరరా గారినే దర్శకత్వం చెయ్యమని అడిగారు రాజేంద్ర ప్రసాద్ గారు.అప్పటికే రామారావు గారు కూడా దర్శకత్వం చెయ్యడం మొదలుపెట్టారు.

కానీ నాగేశ్వరరా గారు మాత్రం దర్శకత్వం చేయడానికి ఒప్పుకోలేదు.కానీ "మధుసూధనరావు దర్శకత్వం చేసినప్పుడు వెనకుండి అన్ని చూసుకున్నది మీరే కదా.కనుకే మీరే మెగా ఫోన్ పట్టుకొని దర్శకత్వం మొదలుపెట్టండి" అని అన్నారు.ఆలా ఆయన దర్శకత్వం చెయ్యడం మొదలుపెట్టారు.రాజేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా "దసరాబుల్లోడు".1970 లో సంక్రాంతికి విడుదలయిన ఈ చిత్రం, ఆ ఏడాది దసరా వరకు ఆడింది.రాజేంద్రప్రసాద్ గారి కథ, దర్శకత్వానికి, ఆత్రేయ గారి మాటలు, పాటలు, మంచి సంగీతం తోడయ్యి, ఈ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా మధుసూధనరావు గారు దర్శకత్వం చెయ్యడం కుదరదు అన్న ఒక్క మాట వలన దర్శకుడిగా మారిన రాజేంద్ర ప్రసాద్ గారు, తన సినీ ప్రస్థానంలో 13 సినిమాలకు దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు