Dhruva : ధ్రువ సినిమా తనకు సెట్ కాదని చేయకూడదనుకున్న రామ్ చరణ్… మరి ఆ తర్వాత ఏం జరిగింది?

2016లో రామ్ చరణ్( Ram Charan ) నటించిన దృవ సినిమా విడుదలైంది.

కేవలం 50 కోట్ల బడ్జెట్ తో విడుదలైన ఈ చిత్రం 132 కోట్ల వసూళ్లను సాధించి అప్పటి వరకు కేవలం 60, 70 కోట్ల మార్కెట్ ఉన్న రామ్ చరణ్ కి 100 కోట్ల బడ్జెట్ దాటి కలెక్షన్స్ రావడంతో అతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) హీరోయిన్ గా నటించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.అయితే ఇంత అద్భుతమైన క్లాసిక్ సినిమాని మొదట్లో రాం చరణ్ చెయ్యకూడదని అనుకున్నాడట.

మరి ఎలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ సినిమా చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

How Dhruva Movie Production Started

ధ్రువ సినిమా( Dhruva ) తెలుగు డైరెక్ట్ మూవీ కాదు.తన్ని ఒరువన్ అనే ఒక తమిళ సినిమాను విడుదలైన మొదటి రోజే చూసిన ఫిలిం డిస్ట్రిబ్యూటర్ N V ప్రసాద్( N V Prasad ) ఒకసారి రామ్ చరణ్ చూస్తే బాగుంటుంది అని చెప్పాడట.దాంతో మొదటి రోజే ఆ సినిమా చూసిన రామ్ చరణ్ పాత్ర చాలా క్లాసిక్ గా ఉంది.

Advertisement
How Dhruva Movie Production Started-Dhruva : ధ్రువ సినిమా

తనకు అప్పటి వరకు మాస్ ఇమేజ్ మాత్రమే ఉంది.యువత తన సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.పైగా బీ, సీ సెంటర్లలో తనకు బాగా డిమాండ్ ఉంది.

ఇలాంటి టైంలో ఎలాంటి మాస్ యాంగిల్స్ లేకుండా ఒక క్లాసిక్ పాత్ర చేస్తే కలెక్షన్స్ వస్తాయో రావో అని రాంచరణ్ భయపడ్డాడట.అప్పటి వరకు మినిమం గ్యారంటీ హీరోగా 60 నుంచి 70 కోట్ల కలెక్షన్స్ అవలీలగా సంపాదిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమా తీస్తే తన పరువు పోతుందేమో అని కూడా అనుకున్నాడట.

How Dhruva Movie Production Started

కానీ ఈ సినిమా చూడమని చెప్పిన వ్యక్తి బీసీ సెంటర్లలో డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో ఏళ్లుగా అనుభవం ఉన్న N V ప్రసాద్ కావడంతో ఓసారి ఆలోచించాడట.అలాంటి ఒక డిస్ట్రిబ్యూటర్ కి సమస్య లేనప్పుడు తాను ఈ సినిమా తీస్తే తప్పేంటి అని అనుకున్నాడట.దాంతో ఎప్పటి నుంచో సురేందర్ రెడ్డి తన కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి అతడికి తన్ని ఒరువన్ సినిమా చూపించి కథ సిద్ధం చేయమని చెప్పారట.

లోకల్ నేటివిటీకి తగ్గట్టుగా కథ మార్పులు చేర్పులు చేయించి సినిమా తీయడంతో ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది.పాత్ర బాగుంటే చాలు క్లాస్, మాస్ అనే తేడా లేకుండా చిత్రాలు విజయవంతం అవుతాయని రామ్ చరణ్ కెరియర్ లో ఈ సినిమా నిరూపించింది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఇక ఈ సినిమాను N V ప్రసాద్ గారే అల్లు అరవింద్ తో కలిసి నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు