నాని తల బాదుకుంటున్నాడు.. నాకు సంబంధం లేదు బాబోయ్‌ అంటూ వివరణ

తెలుగు బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌తో పోల్చితే రెండవ సీజన్‌ ఎక్కువగా వివాదాలను మూట కట్టుకుంటుంది.

నాని కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవ్వడంతో పాటు, సెలబ్రెటీల ఎంపిక విషయంలో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఇక నూతన్‌ నాయుడు నుండి లంచం తీసుకుని మరీ ఆయన్ను ఎంపిక చేసినట్లుగా పలు పుకార్లు షికార్లు చేశాయి.ఇలాంటి సమయంలోనే ఎలిమినేషన్స్‌ పక్రియ ఫేర్‌గా జరగడం లేదని, రీ ఎంట్రీ నిర్ణయం తప్పుడు నిర్ణయం అంటూ విమర్శలు చేస్తున్నారు.

తాజాగా మరో పెద్ద అపవాదును తెలుగు బిగ్‌బాస్‌ మూటకట్టుకున్నాడు.గత వారం ఇంటి నుండి నూతన్‌ నాయుడు ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే.నూతన్‌ నాయుడు ఎలిమినేషన్‌ న్యాయబద్దంగా జరగలేదు అంటూ ఆరోపిస్తున్నారు.

నూతన్‌ నాయుడు కంటే అమిత్‌కు చాలా ఓట్లు తక్కువ వచ్చాయి.అయినా కూడా నూతన్‌ నాయుడు విషయంలో వస్తున్న విమర్శలను ఎదుర్కొలేక బిగ్‌బాస్‌ సభ్యులు ఆయన్ను ఎలిమినేట్‌ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

Advertisement

ఇందుకు నానిని కూడా బాధ్యుడిని చేసి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ నడుస్తోంది.తనపై వస్తున్న ట్రోల్స్‌కు నాని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు.

నాని ట్విట్టర్‌లో.నేను బిగ్‌బాస్‌లో ఏ ఒక్కరికి ఫేవరేట్‌గా వ్యవహరించను.

మీకు ఇంటి సభ్యుల్లో ఒకరు ఫేవరేట్‌గా ఎంపిక చేసుకుని చూస్తారు.కాని నేను మాత్రం అలా కాదు అంటూ తల బాదుకుంటున్నాడు.

నాకు ఇంట్లో ఉన్న వారు అంతా కూడా సమానం.వారిని సమాన దృష్టితో చూస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ? 

మీ ఓట్లతోనే ఎలిమినేషన్‌ జరుగుతున్నాయి, నన్ను నమ్మండి అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

ఎలిమినేషన్‌ విషయంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు జరగడం లేదని, తన నిర్ణయంను బట్టి ఎలిమినేషన్‌ అస్సలు జరగవనే విషయం మీరు తెలుసుకోండి.ఎలిమినేషన్స్‌కు నాకు సంబంధం లేదు.ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే బిగ్‌బాస్‌ టీం ఎలిమినేషన్స్‌ను ప్రకటిస్తారు అంటూ నాని చెప్పుకొచ్చాడు.

నాని ఎంతగా చెప్పినా కూడా ఆయనపై మాత్రం ట్రోల్స్‌ ఆగడం లేదు.నాని భవిష్యత్తుపైనే ఇది ప్రభావం పడే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది.

తాజా వార్తలు