ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హానర్ సంస్థ నుంచి హానర్ ఛాయిస్ ఇయర్ బడ్స్ ఎక్స్5( Honor Choice Earbuds X5 ) పేరుతో అద్భుతమైన ఫీచర్లు ఉండే ఇయర్ బడ్స్ లాంచ్ అయింది.హానర్ ఛాయిస్ ఇయర్ బడ్స్ ఎక్స్5: ఈ ఇయర్ బడ్స్ 30dB వరకు నాయిస్ క్యాన్సలేషన్( Noise Cancellation ) ఫీచర్, హ్యాండ్స్-ఫ్రీ కాల్ ఆన్సర్ ఫీచర్, పర్యావరణ నాయిస్ క్యాన్సలేషన్( ENC ) తో డ్యూయల్ మైక్రోఫోన్ లాంటి ఫీచర్ లతో ఉంటుంది.
హానర్ ఛాయిస్ ఇయర్ బడ్స్ ఎక్స్5 SBC,AAC బ్లూటూత్ కొడెక్ లకు సపోర్ట్ తో 10mm డ్రమ్ డ్రైవర్ లతో పాటు వస్తుంది.
ఈ ఇయర్ బడ్స్ లో ప్రత్యేకంగా ANC యాంబియంట్ సౌండ్ ట్రాన్స్ మిషన్ మోడ్ ను అందించారు.దీంతో మెరుగైన సౌండ్ క్వాలిటీ పొందవచ్చు.
ఈ హానర్ ఛాయిస్ ఇయర్ బడ్స్ ఎక్స్5 చార్జింగ్( Charging ) విషయానికి వస్తే.ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 9 గంటల నిరంతర ప్లే బ్యాక్, 18 గంటల కాలింగ్ సమయం పొందవచ్చు.చార్జింగ్ కేస్ తోపాటు 35 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
ఈ ఇయర్ బడ్స్ చార్జింగ్ కోసం USB టైప్-C పోర్టు ఉపయోగించవచ్చు.దుమ్ము, ధూళి, నీటి నుండి రక్షణ కోసం IP54 రేటింగ్ అందించారు.
ఈ ఇయర్ బడ్స్ ధర రూ.1999 గా ఉంది.ఇవీ హానర్ అధికారిక వెబ్ సైట్ తో పాటు అమెజాన్ లో( Amazon ) అందుబాటులో ఉన్నాయి.
కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులకు సంబంధించిన కార్డులతో ఈ ఇయర్ బడ్స్ ను కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy