పైసా ఖర్చు లేకుండా తెల్లటి మెరిసే ముఖ చర్మాన్ని పొందాలనుకుంటే ఇలా చేయండి!

తమ ముఖ చర్మం తెల్లగా మెరుస్తూ కనిపించాలని చాలా మంది కోరుకుంటారు.

ఈ క్రమంలోనే మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్, సీరం తదితర ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.

వీటి కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.అయితే వీటి వల్ల ఎంత లాభం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

ఆయా ఉత్పత్తుల్లో ఉండే ఎన్నో రకాల కెమికల్స్ చర్మ ఆరోగ్యాన్ని( Skin Health ) పాడు చేస్తాయి.దీర్ఘకాలికంగా అనేక చ‌ర్మ‌ సమస్యలను తెచ్చి పెడతాయి.

కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని పాటిస్తే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే తెల్లటి మెరిసే ముఖ చర్మాన్ని( White Shiny Skin ) తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక అరటి పండు( Banana ) తీసుకుని పీల్ తొలగించి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.ఈ అరటిపండు స్లైసెస్ ను మిక్సీ జార్ లో వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అరటి పండు ప్యూరీ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, ( Multhani Mitti ) వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ తేనె,( Honey ) మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు వేసుకొని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఈ సింపుల్ రెమెడీని రోజుకు ఒకసారి కనుక పాటిస్తే మీ ముఖ చర్మం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది.స్కిన్ టోన్ క్రమంగా మెరుగుపడుతుంది.చర్మంపై ముడతలు, మచ్చలు, మొటిమలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?
రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?

చర్మం టైట్ గా, బ్రైట్ గా మారుతుంది.కాబట్టి పైసా ఖర్చు లేకుండా తెల్లటి మెరిసే ముఖ చర్మాన్ని పొందాలని అనుకునేవారు తప్పకుండా పైన చెప్పుకున్న రెమెడీని పాటించండి.

Advertisement

అందంగా మెరిసిపోండి.

తాజా వార్తలు