త‌ల‌లో చుండ్రు క‌నిపించ‌కూడ‌దంటే ఈ టిప్స్ ను పాటించండి!

చాలా మందిని చిరాకు పెట్టే సమస్యల్లో చుండ్రు ఒకటి.తల మీద చర్మం పొడిబారడం, దానికి సూక్ష్మ క్రిములు తోడవడం చుండ్రు సమస్యకు దారితీస్తాయి.

చుండ్రు కారణంగా తలలో దురద విపరీతంగా ఉంటుంది.పైగా తల స్నానం చేసినప్పుడు భుజాలపై రాలే తెల్ల‌టి పొట్టు వల్ల ఎంత ఇరిటేష‌న్ కు గురవుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే చుండ్రుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలి అనుకునే వారికి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ బాగా సహాయపడతాయి.తలలో చుండ్రు కనిపించకూడదు అంటే మొదట మీరు కరెక్ట్ షాంపూ ను ఎంచుకోవాలి.

మీరు ఎంచుకునే షాంపూ తల మీద చర్మానికి ఎక్కువ తేమను అందించేవిగా ఉండాలి.అలాగే సూక్ష్మ క్రిములతో పోరాడగలగాలి.

Advertisement

కాబట్టి క్లినికల్ షాంపూను ఎంచుకోవాలి.కండిషనర్ కూడా యాంటీ డాండ్రఫ్ దే వాడాలి.

చుండ్రు సమస్య( Dandruff )తో బాధపడుతున్న వారు వారానికి కచ్చితంగా మూడుసార్లు తలస్నానం చేయాలి.త‌ర‌చూ గోరు వెచ్చ‌ని కొబ్బ‌రి నూనెతో మాడును మ‌ర్ద‌నా చేసుకోవాలి.చాలా మంది వేడి వేడి నీటితో తల స్నానం చేస్తూ ఉంటారు.

ఇది తల మీద చర్మం పై తేమను కోల్పోయేలా చేస్తుంది.అందువల్ల హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.

అలాగే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కా చుండ్రును నివారించడానికి చాలా బాగా సహాయపడుతుంది.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వేపాకు పొడి, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉప‌యోగించి తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు మీ వంక కూడా చూడదు.

Advertisement

తాజా వార్తలు