ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే... క‌డుపులో మంట‌, గ్యాస్ ల నుంచి బయటపడవచ్చు

సమయ పాలన లేని భోజనం, ఒత్తిడి, ఉప్పు, కారం, మ‌సాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వంటి కారణాలతో గ్యాస్ సమస్య, కడుపులో మంట వస్తుంది.

గ్యాస్ సమస్యకు కంగారు పడవలసిన అవసరం లేదు.

మనకు ఇంటిలో అందుబాటులో ఉండే వస్తువులతో సమర్ధవంతంగా గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.వాటి గురించి తెలుసుకుందాం.

అల్లం, తేనె, గోరు వెచ్చ‌ని నీరు, నిమ్మ‌ర‌సం

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఓక్ స్పూన్ అల్లం పేస్ట్,రెండు స్పూన్ల తేనే, కొంచెం నిమ్మరసం కలిపి ప్రతి రోజు ఉదయం పరగడుపున త్రాగితే గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.

అల్లం, తేనె, గోరు వెచ్చ‌ని నీరు

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లం పేస్ట్ ,ఒక స్పూన్ తేనే కలిపి త్రాగాలి.

ప్రతి రోజు ఉదయం త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

తేనె, గోరు వెచ్చ‌ని నీరు

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 స్పూన్ తేనెను క‌లిపి ఆహరం తీసుకోవటానికి గంట ముందుగా లేదా ఆహరం తీసుకున్న గంట త‌రువాత తాగాలి.

Advertisement
Home Remedies For Gastric Problems Details, Home Remedies,gastric Problems, Gree

వీలు కాకపోతే రాత్రి పూట నిద్రపోయే ముందు కూడా తాగ‌వ‌చ్చు.దీంతో క‌డుపులో మంట‌, గ్యాస్ త‌గ్గుతాయి.

ఆహారం బాగా జీర్ణ‌మ‌వుతుంది.

Home Remedies For Gastric Problems Details, Home Remedies,gastric Problems, Gree

తేనె, పెరుగు

ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ తేనే కలిపి భోజనము చేసిన తర్వాత తీసుకుంటే జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా చూసి గ్యాస్ సమస్య రాకుండా చేస్తుంది.

తేనె, బేకింగ్ సోడా, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌

అరలీటరు గోరువెచ్చని నీటికి ఒక స్ప్పోన్ తేనే,ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ల‌ను వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని భోజనం చేయటానికి ముందు తీసుకోవాలి.

లేదంటే సమస్య ఉన్నప్పుడు తీసుకోవచ్చు.

తేనె, గ్రీన్ టీ, పాలు

ఒక కప్పు గ్రీన్ టీలో 1 స్పూన్ తేనెను క‌లిపి తీసుకుంటే గ్యాస్, అజీర్ణంల వంటి సమస్యల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

కొవ్వు లేని గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో 1 టీ స్పూన్ తేనెను క‌లిపి త‌ర‌చూ తీసుకుంటే గ్యాస్ స‌మ‌స్య‌లు ఉండవు.ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే చాల వేగంగా మరియు సులభంగా గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.

Advertisement

తాజా వార్తలు