పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హోంగార్డు గా విధులు నిర్వహిస్తున్న తుడుము రాజారావు ఈరోజు ఉదయం విధులకు హజరైయ్యేందుకు సిద్ధం అవుతున్న సమయంలో ఆకస్మికంగా వచ్చిన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
హూటహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవవీకరించారు.పోలీస్ క్వార్టర్స్ లో వున్న మృతదేహాన్ని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ సందర్శించి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అంత్యక్రియ ఏర్పాట్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.మృతుడు రాజారావు స్వగ్రామం బోనకల్లు మండలం రావినూతల కావడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అంబులెన్స్ లో తరలించారు.
అందరితో ఆప్యాయంగా వుండే మంచి సహచరుని కోల్పోయామని, రాజారావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ, ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తోటి హోంగార్డులూ,పోలీస్ అసోసియేషన్ ,హోంగార్డు అసోసియేషన్ ,మినిస్ట్రీయల్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది తెలిపారు.కార్యక్రమంలో ఏఆర్ ఎడిషన్ డిసిపి కుమారస్వామి , ఎ సి పి ఎస్ బి ప్రసన్నకుమార్, AO అక్తరునీసాబేగం, సిఐ సత్యనారాయణ రెడ్డి, ఉదయ్ కుమార్, ఆర్ ఐ లు, శ్రీశైలం, రవి, శ్రీనివాస్ , తిరుపతి, పోలీస్ అసోసియేషన్ వేంకటేశ్వర్లు, జానిమియా, ఆర్ఎస్ఐ నాగుల్ మీరా,హోంగార్డు అసోసియేషన్ సుధాకర్ ,రవి,బంక శ్రీను,నీరాజ,విజయకుమార్ ,శ్రీను,రహీమ్,హోంగార్డులు పాల్గొని పాల్గొని నివాళులు అర్పించారు.
Latest Latest News - Telugu News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy