హమ్మయ్య... సామ్ పోస్ట్ కి రిప్లై ఇచ్చిన అఖిల్... ఏమన్నారో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత (Samantha) అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.

ఇలా నాగచైతన్య (Nagachaitanya) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ప్రస్తుతం తనతో విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన కూడా నాగచైతన్యకు దూరంగా ఉంటున్న అక్కినేని ఫ్యామిలీతో సమంత చాలా క్లోజ్ గా ఉంటుందని తెలుస్తుంది.అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన అఖిల్ సుమంత్ సినిమాలు కనుక విడుదలవుతూ ఉంటే ఈమె సోషల్ మీడియా వేదికగా వారికి విషెస్ చెబుతూ ఉంటారు.

ఇక అఖిల్(Akhil) బర్త్ డే (Birthday) సందర్భంగా ఈమె గత ఏడాది కూడా తనకు శుభాకాంక్షలు చెప్పిన విషయం మనకు తెలిసిందే.తాజాగా ఈ ఏడాది కూడా అఖిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఏప్రిల్ 8వ తేదీ అఖిల్ తన 29వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే సమంత తనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఏజెంట్ సినిమా ఫైర్ లా ఉండబోతుందని తెలియజేస్తూ తనకు విషెస్ తెలిపారు .ఇలా సమంత అఖిల్ కి విషెస్ తెలుపుతూ హార్ట్ సింబల్స్ షేర్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement

ఇలా సమంత అఖిల్ కి శుభాకాంక్షలు తెలిపిన అఖిల్ రిప్లై ఇస్తారా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.అయితే అఖిల్ సమంత తనకు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన పోస్ట్ కు రిప్లై ఇచ్చారు.ఈ సందర్భంగా అఖిల్ రిప్లై ఇస్తూ థాంక్యూ సో మచ్ సామ్.

నీ అంచనాలను అందుకుంటానని అనుకుంటున్నా అంటూ హార్ట్ సింబల్ షేర్ చేశారు.దీంతో అఖిల్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలా సమంత పోస్టుకు అఖిల్ రిప్లై ఇవ్వడంతో ఇంకా ఈమెకు అక్కినేని వారి ఫ్యామిలీతో మంచి అనుబంధము ఉందని నాగచైతన్యను మాత్రమే దూరం పెట్టిందని భావిస్తున్నారు.

అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని
Advertisement

తాజా వార్తలు