సెకండ్ పార్ట్స్ సినిమాలు తీసి హిట్టు కొట్టడం అంత తేలిక కాదు గురూ?

సినిమా అనేది కళారంగానికి చెందినది అయినప్పటికీ, మన దగ్గర చాలా వరకు కళల కోసం సినిమాలు రూపొందించబడవు.కేవలం వ్యాపారం కోసం మాత్రమే సినిమాలు రూపొందుతాయి.

ఎక్కడో ఒక మూలన అరకొరగా కొన్ని కేవలం కళల కోసమే రూపొందించినప్పటికీ ఆయా సినిమాలు ప్రేక్షక ఆదరణకు నోచుకోవు.అందుచేత అలా సమాజం హితం కోసం సినిమాలు చేసేవారు నేడు కరువయ్యారనే చెప్పుకోవచ్చు.

అయితే, ఇది అప్రస్తుతం.

Hits Are Not Possible With Tollywood Sequels ,police Story , Police Story 2, S

అసలు విషయంలోకి వెళితే, ఒక సినిమా విడుదల అయ్యి, సూపర్ వసూళ్లు సాధిస్తే.దాని కొనసాగింపుగా మరో సినిమా రావడం ఎప్పటినుండో ఆనవాయితీగా వస్తోంది.ఈ క్రమంలో కొన్ని సినిమాలు హిట్టయితే, మరికొన్ని సినిమాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి.

Advertisement
Hits Are Not Possible With Tollywood Sequels ,Police Story , Police Story 2, S

అయితే అందులో అత్యధిక శాతం సినిమాలు ప్లాపులుగానే మిగిలిపోతాయి.ఆ లిస్టులో మన తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి.

అందులో మొదటిది డైలాగ్ కింగ్ సాయి కుమార్ హీరోగా నటించిన పోలీస్ స్టోరీ సినిమా( Police Story ) ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసినదే.ఈ సినిమా అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

అయితే దాదాపు కొన్ని సంవత్సరాల తరువాత ఆ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన పార్ట్ 2 మాత్రం అట్టర్ ప్లాప్ అయింది.ఈ లిస్టులో చాలానే ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్( Sardaar Gabbar Singh ) ఫలితం తెలిసిందే.అదే విధంగా రవితేజ నటించిన కిక్ సినిమాకి సెకండ్ పార్ట్ సినిమాగా వచ్చిన కిక్ 2( Kick 2) పరిస్థితి కూడా తెలిసిందే.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఇదే కోవకి చెందుతుంది దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2. ఇలా ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఆయా సినిమాలు ఏ రేంజులో ప్లాప్ అయ్యాయంటే, మొదటి పార్టుల ఇమేజ్ ని నాశనం చేసే స్థాయిలో డిజాస్టర్లుగా మిగిలాయి అని చెప్పుకోవచ్చు.

Hits Are Not Possible With Tollywood Sequels ,police Story , Police Story 2, S
Advertisement

అందుకే సినిమా మేకర్స్ ఓ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందంటే ఇపుడు దాని సెకండ్ పార్ట్స్ తీయడానికి వెనకడుగు వేస్తున్నారు.అయితే అలా సెకండ్ పార్ట్స్ తీసి హిట్టు కొట్టిన దర్శకులు మన దగ్గర కూడా ఉన్నారు.అందులో దర్శక ధీరుడు రాజమౌళి ముందుగా మనకి కనబడతాడు.

బాహుబలి సినిమాని ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి హిట్టు కొట్టిన జక్కన్న దాని సెకండ్ పార్ట్ ని కూడా అదే స్థాయిలో తెరకెక్కించి వారెవ్వా అనిపించాడు.అయితే ఇలా సెకండ్ పార్ట్స్ హిట్టు కొట్టడం అత్యంత తేలికైన విషయం కాదు!.

తాజా వార్తలు