హిట్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు.. ఎంతో తెలుసా?

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్ ఇటీవల రిలీజ్ అయ్యి అదిరిపోయే టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కడంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.

నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఆసక్తి చూపించారు.ఇక రిలీజ్‌ రోజునే ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌తో పాటు మంచి రివ్యూలు తోడవ్వడంతో ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.5.88 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది.కొత్త డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దడంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఇంకా థియేటర్లకు వెళుతున్నారు.

విశ్వక్‌కు తొలి సక్సెస్ అందించిన సినిమాగా హిట్‌ నిలిచింది.ఈ సినిమా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కగా రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా మొదటి వారం కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.నైజాం - 2.60 కోట్లు సీడెడ్ - 0.40 కోట్లు ఉత్తరాంధ్ర - 0.49 కోట్లు ఈస్ట్ - 0.24 కోట్లు వెస్ట్ - 0.21 కోట్లు గుంటూరు - 0.32 కోట్లు కృష్ణా - 0.35 కోట్లు నెల్లూరు - 0.10 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 4.71 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 0.22 కోట్లు రెస్టాఫ్ వరల్డ్ - 0.95 కోట్లు టోటల్ వరల్డ్‌వైడ్ - 5.88 కోట్లు.

రీల్ కోసం ప్రాణాల‌తో చెల‌గాటం.. రైల్వే బ్రిడ్జిపై ఈ మూర్ఖుడు చేసిన పని చూస్తే!
Advertisement

తాజా వార్తలు