నాన్నకు .. లో సూపర్ సీన్ ఇదే..

ఒక్కొక్క సినిమాకీ ఒక్కొక్క సీన్ హై లైట్ అవుతూ ఉంటుంది.

ఆ సన్నివేశం బాగా వర్క్ అవడం తో ఆ సినిమా మొత్తానికీ చాలా పెద్ద ప్లస్ అవుతుంది.

నాన్నకు ప్రేమతో సినిమాకి కూడా అలాంటి ఒక సన్నివేసం పడాలి అనీ దాని దెబ్బతో ఎన్టీఆర్ కి సూపర్ హిట్ పడాలి అని కోరుకుంటున్న ఎన్టీఆర్ ఫాన్స్ కి, సూపర్ న్యూస్ ఇది.రాజేంద్ర ప్రసాద్ చనిపోయే సన్నివేశం ఈ సినిమా లో ఒక మార్క్ గా చెబుతున్నారు.తండ్రి తరపున విలన్ పై పగ తీర్చుకునే క్రమంలో హీరో కొంత మేరకు సాధించిన విజయాన్ని టీవీలో చూస్తూ, ఆసుపత్రి మంచం మీద నుంచి లేచే ప్రయత్నం చేస్తూ తండ్రి పాత్ర మరణిస్తుందంట.

ఆ సమయంలో ఎన్టీఆర్, ముందుగా నవ్వడం.తండ్రి ఎప్పుడూ నవ్వుతూనే వుండాలని చెప్పాడంటూ, ఆపై మళ్లీ కన్నీళ్లు పెట్టుకోవడం.ఈ సీనంతా ఎన్టీఆర్ అద్భుతంగా చేసాడట.

తండ్రి చనిపోతే నవ్వడం ఏంటీ సెంటిమెంట్ అవుతుందేమో అనుకున్నారట ముందు.కానీ సుకుమార్ సీన్ ని వివరించి ఎన్టీఆర్ నుంచి అద్భుతమైన నటన రాబట్టాడు అని చెబుతున్నారు.

Advertisement
Which Healthier Between Buttermilk And Curd

తాజా వార్తలు