హైదరాబాద్ పబ్ నిర్వాహకులకు హైకోర్టు షాక్

హైదరాబాద్ పబ్ నిర్వాహకులకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది.రాత్రి 10 గంటలు దాటిన తర్వాత సౌండ్ పెట్టవద్దని న్యాయస్థానం ఆదేశించింది.

జూబ్లీహిల్స్ లోని పది పబ్ లు రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ పెట్టొద్దని తెలిపింది.న్యూ ఇయర్ ఈవెంట్స్ లోనూ 10 గంటల తరువాత సౌండ్ పెట్టొద్దని వెల్లడించింది.

ఈ క్రమంలో పబ్ లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కాలనీవాసులు స్వాగతిస్తున్నారు.ఈ క్రమంలో వాళ్లు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా పబ్బులను పూర్తిగా కాలనీ నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేయడంతో పాటు పబ్బులను తొలగించేంత వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు.

Advertisement
వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?