హైకమాండ్ ఫోకస్.. రేవంత్ పైనే !

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల( Telangana election ) వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు మామూలుగా లేదు.

అధికార బి‌ఆర్‌ఎస్ కు ధీటుగా విన్నింగ్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని కచ్చితంగా 70-80 స్థానాలను కైవసం చేసుకుంటామని హస్తం నేతలు చెబుతున్నారు.హస్తం పార్టీ జాతీయ నేతలు సైతం తెలంగాణ విజయంపై ధీమాగానే ఉన్నారు.

అందుకే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీ,( Sonia Gandhi ) మల్లికార్జున్ ఖర్గే వంటి వారు శాతం తెలంగాణలోనే మకాం వేశారు.ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగే హస్తంపార్టీనే విజయం సాధిస్తే వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ఆ పార్టీలే వినిపిస్తున్న ప్రశ్న.

High Command Focus.. On Revanth Reddy , Revanth Reddy , Congress , Brs , Pol

సి‌ఎం ఎవరిని చేయాలి ? పార్టీలో ఎవరి పాత్ర ఎంత అని ఎలా నిర్ణయించాలి ? అనేది హైకమాండ్ కు పెద్ద చిక్కుముడే.గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు గట్టిగానే ఉన్నప్పటికి పార్టీని దూకుడుగా ముందుకు నడిపింది మాత్రం రేవంత్ రెడ్డే అనేది ఆ పార్టీలోని చాలమంది అభిప్రాయం.అందుకే సి‌ఎం అభ్యర్థిగా కూడా రేవంత్ రెడ్డే ఉండాలని హస్తం పార్టీలో ఓ వర్గం బలంగా కోరుకుంటుంది.

Advertisement
High Command Focus.. On Revanth Reddy , Revanth Reddy , Congress , Brs , Pol

కానీ పార్టీలోని సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు సి‌ఎంగా ఉండేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

High Command Focus.. On Revanth Reddy , Revanth Reddy , Congress , Brs , Pol

దీంతో పార్టీలో సి‌ఎం అభ్యర్థి విషయమై కల్లోలం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి ( Revanth reddy )వైపే మొగ్గు చూపుతున్నట్లు ఇన్ సైడ్  టాక్.ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే సి‌ఎం అభ్యర్థిగా కూడా రేవంత్ రెడ్డి నే ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల సి‌ఎం పదవి విషయంలో రేవంత్ రెడ్డి పదే పదే నోరు మెదుపుతున్నారు.పరోక్షంగా సి‌ఎం తానేననే హింట్ ఇస్తున్నారు.దీంతో ఆల్రెడీ సి‌ఎం అభ్యర్థి పైన అంతర్గత ఒప్పందాలు జరిగినట్లే కనిపిస్తోంది.

మరి ఒకవేళ రేవంత్ రెడ్డి అధికారిక సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తే హస్తం పార్టీలో జరిగే తరుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు