తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ పిలుపు

తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.

ఈ మేరకు ఆ పార్టీకి చెందిన నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ లు ఢిల్లీకి పయనమైయ్యారు.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఇరువురు నేతలు భేటీ కానున్నారని సమాచారం.ఉపఎన్నిక జరిగిన తీరుతో పాటు జీఎస్టీ దాడులపై అమిత్ షాకు వివరించే అవకాశం ఉంది.

కాగా మునుగోడు ఉపఎన్నికలో ఓటమి పాలైన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు.మరోవైపు తెలంగాణలోని రామగుండంలో ప్రధాని నరేంద్ర మోదీ సభ తర్వాత రాష్ట్ర నేతలకు ఢిల్లీకి రావాలని పిలుపు రావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!
Advertisement

తాజా వార్తలు