అరె బుడ్డోడా అది రంగులరాట్నం కాదు.. వాషింగ్ మిషన్ జాగ్రత్త (వీడియో)

సాధారణంగా చిన్నపిల్లలు చేసే పనులు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి.కానీ, అవి అనుకోని ప్రమాదాలు సంభవిస్తాయని ఎవరు కూడా ఊహించరు.

అంతేకాదు ఆలోచించరు కూడా.పెద్దల పర్యవేక్షణ లేని సమయంలో పిల్లలు ప్రమాదకరమైన ఆటలు ఆడడం మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.

పెద్దలు పర్యవేక్షణ లేని సమయంలో ఇంటి బయట ఉండే బాల్కనీ వద్ద నిలబడి విచిత్ర విన్యాసాలు ( Strange feats )చేస్తూ ఎంతో మంది పిల్లలు ప్రమాదంలో పడిన సంఘటనలు కూడా మనం చాలానే చూసాం.అచ్చం అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

వాషింగ్ మిషన్ వద్ద ఈ తుంటరి పిల్లలు చేసిన పనిని చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు.ప్రస్తుతం వాషింగ్ మిషన్ ( Washing machine )వద్ద పిల్లలు చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Advertisement

ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే .

వైరల్ అవుతున్న వీడియోలో ఇంటి ఆవరణలో ఉన్న వాషింగ్ మిషన్ వద్ద ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు.ఈ క్రమంలో ఒక పిల్లవాడు వాషింగ్ మిషన్ పైకి ఎక్కడంతోపాటు డ్రైయర్ రంధ్రంలోకి వెళ్లిపోయాడు.వాషింగ్ మిషన్ డ్రైయర్ లో ఇరుక్కొని అలాగే కూర్చున్నాడు.

ఇంతటితో అంతా బాగుంది కానీ.అనంతరం మరొక పిల్లవాడు అక్కడికి వచ్చి డ్రైన్ ను ఆన్ చేశాడు.

దీంతో అది కాస గుండ్రంగా తిరుగుతూ ఉండడం మనం చూడవచ్చు.అలాగే దానితోపాటు అందులో ఉన్న చిన్నపిల్లవాడు కూడా గుండ్రంగా తిరుగుతున్నాడు.

మరిగే నీటితో ఐస్ చేయాలనుకుంది.. చివరికి ఏమైందో చూస్తే వణుకు పుడుతుంది!
ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?

ఈ సమయంలో ఆ పిల్లవాడే అదృష్టం బాగుండి ఎటువంటి ప్రమాదానికి గురి ఇవ్వలేదు.కానీ ఒకవేళ టైం బాగా లేకుంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ( Short circuit )జరిగి అందులో ఇరకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే సంభవించేది.

Advertisement

అయితే, ఇలా పిల్లలు ఆడుతున్న సేపు అక్కడున్న వ్యక్తి దాన్ని వీడియో తీసాడే కాని ఆ పిల్లలను ఆపే ప్రయత్నం అసలుకు చేయలేదు.ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్ చేయడంతో పాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముందుగా ఇలా పిల్లలు చేస్తున్న క్రమంలో వీడియో తీసిన వ్యక్తిపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా పిల్లలు తెలిసి తెలియని వయసులో అలా చేస్తుంటే వాళ్ను పక్కకి తీసుకెళ్లాల్సింది పోయి వీడియో తీయడం ఏమిటా అంటూ కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు