అరె బాబు.. ఆది బొమ్మ కాదురయ్యా.. జాగ్రత్త!

పాములు… ఈ పేరు వింటేనే చాలామందికి భయం పట్టుకుంటుంది.ప్రకృతిలో అంతర్భాగంగా పాములు విశేషంగా ప్రాధాన్యం కలిగిన జీవులు.

ఇవి వేటలో నిపుణులు, కొన్ని విషసర్పాలైతే ప్రాణాంతకంగా కూడా మారతాయి.అయితే, ప్రకృతిలో వాటి పాత్ర ఎంతో ముఖ్యమైనది.

పాములు ఎలుకల(Snakes and rats) వంటి సంఖ్యను నియంత్రించి పంటలకు రక్షణ కల్పిస్తాయి.అందుకే పాములు మనకు ప్రమాదకరమైనవే కాక, పరోక్షంగా ఉపయోగపడే జీవులుగా కూడా చెప్పుకోవచ్చు.

ఇప్పటి డిజిటల్ యుగంలో సోషల్‌ మీడియాలో ప్రతీరోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి.ప్రత్యేకంగా భిన్నంగా, విభిన్నంగా ఉండే వీడియోలు నెట్టింట ట్రెండ్‌ అవుతాయి.

Advertisement

వాటిలో పాములతో సంబంధమైన వీడియోలకు అయితే నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తోంది.ఒక్కసారి చూడగానే ఔరా అనిపించేలా ఉండే వీడియోలు నెటిజన్లలో భయం, ఆశ్చర్యం కలగలిపేలా చేస్తాయి.

తాజాగా ఇలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.వీడియోలో ఓ చిన్నారి కుర్రాడు తన చేతిలో ఓ పామును పట్టుకొని ఆడుకుంటున్నాడు.

అది బొమ్మ కాదేమో(not a toy) అనే అనుమానమే వస్తుంది.కానీ అది నిజమైన పామే.

ఆ చిన్నారి పాము పట్ల ఎలాంటి భయం లేకుండా, అదేదో సాధారణ ఆటబొమ్మలా దాన్ని తడిమి చూస్తూ ఆడుకుంటున్నాడు.ఇది చూస్తూ ఓ వ్యక్తి ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కి గురవుతున్నారు.చిన్నారి ప్రాణాలతో ఇలా ఆడుకోవచ్చా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిన్నపిల్లాడి భద్రతను గుర్తించకుండా కేవలం వ్యూస్‌ కోసం ఇలాంటి వీడియో తీయడమేంటని ఆ కుటుంబ సభ్యులపై ఫైర్‌ అవుతున్నారు.

Advertisement

మరికొందరేమో అరె బాబు అది అది బొమ్మ కాదు పాము(A snake, not a toy) అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఫేమ్ కోసం, ట్రెండ్‌ కోసం చిన్నారుల ప్రాణాలను సైతం పణంగా పెడతారా? అంటూ మరికొందరు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ఇలాంటి సందర్భాలలో పెద్దల బాధ్యత ఎంతో ముఖ్యం.పిల్లల భద్రతకు మించి మరేదీ ఉండదు.పాములు ప్రమాదకరమైనవని తెలుసుకొని, వాటిని దగ్గరగా ఉంచకుండా ఉండటం, పిల్లలకు వాటి గురించి సరైన అవగాహన కల్పించటం అవసరం.

వైరల్‌, వ్యూస్‌ అన్నీ ఒకపక్క… కానీ జీవితంతో ఆడుకోవడమా? అనే ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్‌ అవుతోంది.

పాముతో ఆడుకుంటున్న బుడ్డోడి దృశ్యం ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా, ఇది ఒక బోధన కావాలి.పిల్లల (Childrens)ప్రాణాలతో సరదా చేయకూడదని, సమాజం ముందున్న బాధ్యతను గుర్తించాలనే సందేశం అందించాలి.

తాజా వార్తలు